Pakistan : పాకిస్తాన్ అత్యంత చెత్త రికార్డు.. ఇంగ్లాండ్ ముందు తలవంచిన పాక్
Pakistan Worst Record : 1877 మార్చిలో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య మొదటి అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. అది టెస్ట్. అప్పటి నుంచి నేటికి 147 సంవత్సరాలు. ఇంతలో ఎన్నో ప్రపంచ రికార్డులు సృష్టించబడ్డాయి. అలాగే ఆ రికార్డులు బద్దలయ్యాయి. కానీ మొదటి ఇన్నింగ్స్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసి ఒక జట్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం ఇది వరకు ఎప్పుడూ జరగలేదు, కానీ ఈ అంత్యంత చెత్త రికార్డు ఇప్పుడు పాకిస్తాన్ పేరిట నమోదైంది. తొలి ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలతో 556 పరుగులు చేసి ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిపోయిన తొలి జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది.
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ 823 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతకు ముందు పాక్ జట్టు తలొగ్గక తప్పలేదు. రెండో ఇన్నింగ్స్‌లో 220 పరుగులు చేయగా, 9 వికెట్లు పడిపోయాయి. అబ్రార్ అహ్మద్ అన్ ఫిట్ కావడంతో మైదానంలోకి రాలేదు. పాకిస్థాన్‌కు ఇది అత్యంత అవమానకరమైన ఓటమి. ఇంతకు ముందు ఏ జట్టు కూడా ఇలాంటి ఓటమిని చవిచూడలేదు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 149 ఓవర్లకు 3 సెంచరీలతో 556 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ 184 బంతుల్లో 102 పరుగులు, కెప్టెన్ షాన్ మసూద్ 177 బంతుల్లో 151 పరుగులు, ఆఘా సల్మాన్ 119 బంతుల్లో అజేయంగా 104 పరుగులు చేయడంతో పాక్ జట్టు ఆనందంతో పొంగిపోయింది. సౌద్ షకీల్ కూడా 177 బంతుల్లో 82 పరుగులు చేశాడు. భారీ పరుగులు వచ్చాయన్న సంతోషం ఆ జట్టు అభిమానుల్లో కొద్ది సేపు నిలవలేదు.
ఇంగ్లండ్ కెప్టెన్ పరుగలేమి చేయకుండా ఔటయ్యాడు. కానీ ఇంగ్లండ్ 823 పరుగులు చేసింది. ఒక జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేస్తే, దాని బౌలర్ల నైతికత ఆకాశమంత ఎత్తులో ఉంటుంది. కెప్టెన్ ఒల్లీ పోప్‌ను సున్నాకు ఔట్ చేసిన నసీమ్ షా జట్టులో ఉత్సాహం నింపాడు. అయితే పాకిస్తానీ జట్టు సంతోషంగా ఉండటం బహుశా ఇదే మొదటిది, చివరిసారి కూడా. ఆ తర్వాత జాక్ క్రౌలీ 78 పరుగుల వద్ద, బెన్ డకెట్ 84 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. అయితే, జో రూట్, హ్యారీ బ్రూక్ వరుసగా 262, 317 పరుగులతో సునామీ సృష్టించారు. ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 823 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.