Salaar CeaseFire Trailer:`సలార్` ట్రైలర్..ప్రాణస్నేహితుడి కోసం ఒక్కడే సైనికుడై..
Salaar CeaseFire Telugu Trailer:`బాహుబలి`తో భారతీయ సినిమా ఊపిరి పీల్చుకుంది. దీంతో సరికొత్త పాన్ ఇండియా సినిమాలకు సరికొత్త దారి ఏర్పడింది. ఇండియన్ సినిమా హాలీవుడ్ ని సైతం మరి పించగలదని, ఆ స్థాయి సినిమాలని మనం కూడా నిర్మించగలమని నిరూపించింది. అంతే కాకుండా తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా రెప రెప లాడించి కొత్త తరహా సినిమాలకు ఊపిరి పోసింది. ఆ తరువాత వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్ చాప్టర్ 2, `పుష్ప` సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
ఇదే ఊపులో జక్కన్న తెరకెక్కించిన `ఆర్ ఆర్ ఆర్` ఏకంగా చిర కాల స్వప్నంగా నిలిచిన ఆస్కార్‌ని ముద్దాడి భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. మరెన్నో పాన్ ఇండియా సినిమాలకు కొండంత ధైర్యాన్నిచ్చింది. `ఆర్ ఆర్ ఆర్` సృష్టించిన సంచలనం తరువాత అంతకు మించి అనే స్థాయిలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ `సలార్ సీజ్‌ఫైర్`. కేజీఎఫ్` సిరీస్ సినిమాలతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ `ఛత్రపతి` తరహాలో ఫెరోషియస్‌గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించి చాలా ఏళ్లవుతోంది. ఆ ఫీల్‌ని, ప్రభాస్‌లో ఉన్న రెబల్ స్టార్‌ని మళ్లీ పూర్తి స్థాయిలో బయటికి తీసుకొస్తున్న సినిమా `సలార్`. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసి యూట్యూబ్‌లో రికార్డులు తిరిగరాసింది. సినిమా డిసెంబర్ 22న భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న వేళ ట్రైలర్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు హోంబలే ఫిలింస్ అన్నట్టుగానే శుక్రవారం సర్ ప్రైజ్ ఇచ్చేస్తూ ట్రైలర్‌ని శుక్రవారం రాత్రి 7:19 గంటలకు ఐదు భాషల్లో రిలీజ్ చేసింది.
ట్రైలర్ హైలట్స్…
దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో విడదీయలేని స్నేహం ఉండేది. నీ కోసం ఎరైనా అవుతా.. సొరైనా అవుతా…నీ ఒక్కడి కోసం..నువ్వు ఎప్పుడు పిలిచినా నేనిక్కడికొస్తా..ఈ కథ వెయ్యేళ్ల క్రితం మొదలైంది..` అనే డైలాగ్‌లతో ట్రైలర్ మొదలైంది. కేజీఎఫ్ ప్రపంచంలోనే కథ సాగుతున్నట్టుగా కనిపిస్తున్నా ఇదొక వేరే ప్రపంచం.. ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రపంచం. ఈ వరల్డ్‌లో తన ప్రాణ స్నేహితుడి కోసం దేవా (ప్రభాస్) ఏం చేశాడు? ఎంత వరకు వెళ్లాడు? ..అతని కోసం ఎర అయ్యాడా? ..లేక అందరిని మింగేసే సొరగా మారాడా? అన్నదే అసలు కథ.
మెయిన్ స్టోరీ లైన్…ట్రైలర్‌లో అసలు కథేంటో.. దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పేశాడు. మెయిన్ స్టోరీ లైన్‌ని బయటపెట్టేసినా దాన్ని ఎంత పవర్ ఫుల్‌గా నడిపించాడు? ప్రభాస్‌ని ఏ స్థాయిలో ఓ డైనోసార్‌గా మళ్లీ రెబల్ స్టార్ విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు అన్నది ఇందులో ఆసక్తికరం. `ఈ కథ వెయ్యేళ్ల క్రితం మొదలైంది. మహమ్మద్ గజినీ, ఛెంగీజ్ ఖాన్‌ల కన్నా క్రూరమైన బందిపోట్లు ఉండేవారు. ఈ బందిపోట్లు వందల సంవత్సరాలు వారికి ఎదురు లేకుండా ఎదిగారు. ఖాన్‌సార్ అనే అడివిన ఒక కోటగా మార్చుకున్నారు. ఆ ఖాన్ సార్ ఒక సామ్రాజ్యమైంది` అంటూ అసలు కథ, దాని వెనకున్న కుట్రలని పరిచయం చేశాడు.
సరికొత్త ప్రపంచంలోకి… కేజీఎఫ్ తరహాలో మరో ప్రపంచాన్ని ప్రశాంత్ నీల్ ట్రైలర్‌లో పరిచయం చేశాడు. ఇక్కడ కూడా కుర్చీ కోసం జరిగే కుతంత్రాలని, కుటిల బుద్దితో ఎదురు చూసే ఓ గ్యాంగ్‌ని పరిచయం చేసిన తీరు రోరోమాంచితంగా ఉంది. వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్)ని దొరగా చూడాలనేది రాజమన్నార్ (జగపతిబాబు) కోరిక కానీ ఆ కోరిక నెరవేరకూడదని, రాజమన్నార్ తిరిగొచ్చేలోపు వరదరాజమన్నార్‌నే లేపేస్తే సామ్రాజ్యం మనది అవుతుందన్నది ప్రత్యర్థుల పన్నాగం. ఇందు కోసం అరాజక శక్తుల్నీ ఎకమై ఏం చేశాయి? వాళ్లని అంతమొందించడానికి ఒక్కడే సైనికుడై తన స్నేహితుడి కోసం యుద్ధం చేస్తే..దారుణమైన యుద్దం చేస్తే అదే `సలార్`.
ఇండియన్ బాక్సాఫీస్ షేక్: ట్రైలర్‌లోని చూపించిన ప్రపంచం, ఆయుధాలు, మనుషుల వేషధారణ, వాడే వెపన్స్.. చుట్టూ ఉన్న సామ్రాజ్యం వెరసి ఓ హాలీవుడ్ సినిమాని ఇండియన్ స్క్రీన్‌పై అందిస్తే ఎలా ఉంటుంది.. అదే `సలార్` వరల్డ్. `పెద్ద పెద్ద గోడలు కట్టేది..భయపడి..బయటికి ఎవడో పోతాడని కాదు. లోపలికి ఎవడొస్తాడని, ఎవ్వడూ ముట్టుకోకూడదూ…ప్లీజ్..ఐ కైండ్లీ..రిక్వెస్ట్.. అంటూ ప్రభాస్ ప్రత్యర్థుల్ని రిక్వెస్ట్ చేస్తూ పలికే డైలాగ్‌లు, యాక్షన్ ఘట్టాలు రోమాంచితంగా ఉన్నాయి. `బాహుబలి`తో ఇండియన్ సినిమాకు సరికొత్త అధ్యయాన్ని లికించిన ప్రభాస్ `సలార్`తో తన ఉగ్ర రూపాన్ని చూపించి ఇండియన్ బాక్సాఫీస్‌తో పాటు వరల్డ్ వైడ్‌గా వసూళ్లుని షేక్ చేడం ఖాయంగా కనిపిస్తోంది.