holidays : బ్యాంకులకు వరుస సెలవులు.. ఈ నెలలో ఎప్పుడెప్పుడంటే?

 holidays

holidays

Bank holidays :  దేశంలో పండుగ వాతావరణం నెలకొంది. దసరా శరన్నవరాత్రులు జరుగుతుండగా అక్టోబర్ 11 నుంచి 14 వరకు వరుసగా బ్యాంకులకు సెలవులు రానున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఫైనాన్షియల్ గా డబ్బులను ముందే సమకూర్చుకోవాలని బ్యాంకు పనులు ఉంటే ఏవైనా చేసేసుకోవాలని చాలామందికి బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు.

అక్టోబర్ 11 మహానవమి సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సెలవులు ప్రకటించారు. 11 ,12, 13, 14 రోజుల్లో బ్యాంకుల కు సెలవులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కోల్కతా, పాట్నా లక్నో , సిక్కిం గ్యాంగ్ టాక్ హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ కొచ్చి కోల్కతా తదితర ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. 12వ తేదీ దసరా  శనివారం రావడంతో బ్యాంకులకు సెలవులు ప్రకటించినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

13 నాడు సండే రావడం 14 నాడు కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు తెరుచుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దేశంలోని వివిధ ప్రాంతాల్లో దుర్గ పూజ జరిగే అవకాశం 14వ తేదీ నాడే ఉంది. కాబట్టి ఆ రోజు కూడా బ్యాంకులకు సెలవులు ఉండే అవకాశం ఉంది. దీంతో ఎలాంటి పనులు ఉన్నా ముందే చేసుకోవాలని అనుకుంటున్నారు. కొంతమంది బ్యాంకు చాలు ఉంటుందని అక్కడికి వెళ్లి ఇబ్బంది పడతారని అలాంటి వారి కోసం ముందే చెబుతున్నామని తెలిపారు.

బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో చాలామంది ఫైనాన్స్  పరిశ్రమలు నడిపించే వారు లేదా ఇతర బ్యాంకులపై ఆధారపడి పనిచేసే పాల వ్యాపారులు  కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయినప్పటికీ పండుగ సమయంలో బ్యాంకులకు సెలవు ఇవ్వడం కామన్. కానీ ఒక రోజు రెండు రోజులు వస్తుంటాయి. ఈసారి ఏకంగా నాలుగు రోజులు వరుసగా లీవ్స్ రావడంతో ప్రజలు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయినప్పటికీ పండుగ సెలబ్రేషన్లో దేశ ప్రజలు మునిగి పోయారు.

TAGS