Rafael Nadal : రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్

Rafael Nadal
Rafael Nadal : స్పెయిన్ స్టార్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ లో జరిగే డేవిస్ కప్ ఫైనల్స్ తన ఆఖరి మ్యాచ్ అని తెలిపారు. 1986 జూన్ 3న పుట్టిన నాదల్ 2001లో అంతర్జాతీయ టెన్నిస్ లోకి ప్రవేశించారు. 2008లో నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు 22 గ్రాండ్ స్లామ్ టైటిల్లు గెలుపొందిన ఆయన గాయాలతో వేగలేక ఈ నిర్ణయ తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘‘గత కొన్ని సంవత్సరాలు చాలా కష్టంగా గడిచాయి. మరీ ముఖ్యంగా గత రెండేండ్లు ఎన్నో బాధలు పడ్డాను. ఎంతో ఇష్టమైన ఆటకు వీడ్కోలు పలకడం ఎంతో కష్టమైన నిర్ణయం. అందుకు నాకు ఎంతో సమయం పట్టింది. అయితే, జీవితంలో ప్రతిదానికి ఆరంభం ఉన్నట్టే ముగింపు కూడా ఉంటుంది’’ అని నాదల్ తన వీడ్కోలు ప్రకటనలో పేర్కొన్నాడు.
TAGS Rafael Nadal