Tamil Nadu court : అన్య మతస్తులకు ఆలయంలోకి ప్రవేశం లేదు..: తమిళనాడు కోర్టు సంచలన వ్యాఖ్యలు..

Tamil Nadu court

Tamil Nadu court

Tamil Nadu court : గత పదేళ్లుగా ఆలయాలు, హిందూ ధర్మంపై కోర్టులు వెలువరుస్తున్న తీర్పులపై పెద్ద చర్చనే కొనసాగుతోంది. గతంలో రామ జన్మభూమి తీర్పు కవచ్చు.. ఇంకా చాలా వరకు ఉన్నాయి. ఇటీవల మరో సంచలన తీర్పును తమిళనాడు హై కోర్టు వెలువరించింది. హిందూ మతాలకు ఆనవాలమైన ఆలయాల్లోకి అన్యమతస్తులకు ప్రవేశం లేదని సంచలన తీర్పు ఇచ్చింది. హిందూ ధర్మం, హిందూ దేవతలపై నమ్మకం లేనప్పుడు ఎందుకు ఆలయాలకు వెళ్లాలి అని ప్రశ్నించింది. ఆలయాలు పిక్నిక్ స్థలాలు కావని, అవి పవిత్రతకు నిలయాలని కోర్టు భావిస్తుందన్నారు. హిందూ ధర్మకంపై నమ్మకం లేని వారికి ప్రవేశం ఎందుకు? ఇకపై ఇతర మతస్తులను ఆలయంలోకి ప్రవేశం కల్పించవద్దు, వారికి ప్రవేశం లేదని కోర్టు స్పష్టం చేసింది.

ఒక వేళ అన్య మతస్తులు గనుక ఇతర దేవుళ్లను చూడాలనుకుంటే అదీ ఆలయంలో చూడాలనుకుంటే తప్పనిసరిగా అఫిడవిట్ సమర్పించాలని సూచించింది. అందులో ‘నేను హిందూ దేవీ, దేవతలను నమ్ముతున్నాను’ అని రాసి ఆలయ సిబ్బంది వద్ద సంతకం పెట్టి దేవాలయంలోకి వెళ్ళాలి’ అని మద్రాస్ హైకోర్ట్ తీర్పులో పేర్కొంది. అయితే ఈ తీర్పుతో భగవంతుడిపై చీప్ ట్రిక్స్ ప్లే చేసే పార్టీ డీఎంకే గొంతులో వెలక్కాయ పడినట్లు అయ్యింది.

హిందూ మతానికి సంబంధించి దేవీ, దేవతలను నమ్మని కొందరు ఆలయాల్లోకి ప్రవేశించి వాటి పవిత్రను నాశనం చేస్తున్నారు. కొందరు వీటిని పిక్నిక్ స్పాట్లు అనుకుంటున్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్రాస్ కోర్టు వెలువరించిన తీర్పు కొంత ఆలోచనను రేకెత్తించింది.

TAGS