Team India : ఢిల్లీ కోటలో టీమిండియా అద్భుత విజయం
టీమిండియా నిర్ధేశించిన 221 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2024లో భారత్ 28వ విజయాన్ని నమోదు చేసింది. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు సాధించిన రికార్డును తర్వాతి మ్యాచ్‌లో సమం చేసే అవకాశం భారత్‌కు ఉంది. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు సాధించిన దేశంగా ఉగాండా రికార్డు సృష్టించింది. ఉగాండా 2023లో 29 విజయాలు సాధించింది. టీ20లో భారత్‌కు ఇది వరుసగా 9వ విజయం.
29 ఉగాండా (2023)
28 భారతదేశం (2022)
21 టాంజానియా (2022)
20 భారతదేశం (2024)
20 పాకిస్తాన్ (2020)
టీమ్ ఇండియా తొలిసారి ఫీట్
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 221 పరుగులు చేసింది. తర్వాత బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 135 పరుగులకే పరిమితం చేసింది. బంగ్లాదేశ్ తరఫున మహ్మదుల్లా అత్యధికంగా 41 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లు వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు. తన రెండో మ్యాచ్‌లో అద్భుత హాఫ్ సెంచరీ చేయడమే కాకుండా నితీష్ రెడ్డి రెండు వికెట్లు తీశాడు. ఈ అద్భుత ప్రదర్శనకు అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏడుగురు బౌలర్లను ఉపయోగించాడు. నితీష్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అభిషేక్ శర్మ, ర్యాన్ పరాగ్ ఒక్కో వికట్ తీశారు. దీంతో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఏడుగురు భారత బౌలర్లు వికెట్లు తీయడం ఇదే తొలిసారి.