Abhishek : అభిషేక్ మళ్లీ ఆ తప్పు చేయకు.. శిష్యుడికి యువరాజ్ వార్నింగ్

Abhishek

Abhishek

Abhishek : భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ప్రారంభమైన టీ20ల సిరీస్ తొలి మ్యాచ్ లో టీమిండిమా బంగ్లాదేశ్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 128 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
అయితే ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తక్కువ స్కోరుకే రనౌట్ గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన టీమిండియాకు ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ  జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. అయితే రెండో ఓవర్ చివరి బంతికి అభిషేక్ శర్మ, సంజూ మధ్య సమన్వయ లోపంతో అభిషేక్ శర్మ రనౌట్ అయ్యాడు.
ఈ రన్ అవుట్ అభిషేక్ ను స్థైర్యాన్ని దెబ్బతీసినట్లుగా అనిపించింది. అభిషేక్ శర్మ బ్యాటింగ్ లో దూకుడుగా కనిపించాడు .7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 16 పరుగులు చేసి, రనౌట్ కావడంతో భారీ స్కోరు చేయలేకపోయాడు.
యువరాజ్ సింగ్ నిరాశ
అభిషేక్ శర్మ తప్పిదానికి అతని మెంటార్,  భారత మాజీ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ విస్మయం వ్యక్తం చేశాడు. ఆటలో సంయమనం కోల్పోకూడదని, ఏకాగ్రతగా ఉండాలని సూచించారు.  అభిషేక్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి యువరాజ్ సింగ్ రిప్లై ఇచ్చాడు. యువరాజ్ కొన్నేళ్లుగా అభిషేక్‌తో సన్నిహితంగా ఉంటున్నాడు. వీరిద్దరూ మెంటార్, శిష్యులుగా మెలుగుతున్నారు. అభిషేక్ బ్యాటింగ్ నైపుణ్యాలను మెరుగుపరిచే బాధ్యతను ఆ మాజీ ఆల్ రౌండర్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.
అభిషేక్ శర్మ చేసిన పోస్ట్ కు ఓ నెటిజన్ నీ నుంచి భారీ పరుగులు ఆశించవచ్చా అని ప్రశ్నించాడు. సదరు నెటిజన్ ప్రశ్నకు యువరాజ్ సింగ్ రిప్లై ఇచ్చాడు. మొదటి మ్యా్చ్లో రనౌట్ అభిషేక్ స్వీయ తప్పిదని పరోక్షంగా పేర్కొన్నాడు. కాస్త బుర్రకు పదును పెట్టి ఆలోచించాలని సూచించాడు. “అతని ప్రదర్శన కచ్చితంగా బాగుంటుందని, స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉందని, కానీ పెద్ద స్కోర్లు రాలేదని పేర్కొన్నాడు. టీమిండియాలో స్థానం నిలబెట్టుకోవాలంటే భారీ స్కోర్లు చేయడం ప్రధానమని పేర్కొన్నాడు.
TAGS