Modi magic : 20 రోజుల్లో అంచనాలు తారుమారు..? మోదీ మ్యాజిక్కా.. ఆర్ఎస్ఎస్ ఒత్తిడా?
Modi magic : హర్యానాలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని అంతా భావించారు. హర్యానా నుంచి బీజేపీ నిష్క్రమణ ఖాయం అని అనుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కూడా బీజేపీ అనుకున్నంతగా లేవు. ఇక హర్యానాలో ఓడితే బీజేపీలో సంస్థాగతంగా మార్పులు తప్పవనని హర్యానా ఎన్నికల తేదీలు ప్రకటించక ముందు నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఊహాగానాలు బీజేపీతో పాటు ప్రధాని మోడీపైనా ఒత్తిడిని పెంచాయి. మరోవైపు, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ప్రధాని మోదీ పేరు ఎత్తకుండా పలు సభల్లో పరోక్షంగా విమర్శలు గుప్పించారు. హర్యానా ఎన్నికల్లో పరాజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అధికారాలకు మోహన్ భగవత్ కోత పెట్టవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. బీజేపీ అధ్యక్షుడితో పాటు ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ పదవిని భగవత్ తనకు ఇష్టమైన వారికి అప్పగిస్తారనే ప్రచారం కూడా సాగింది.
ఎగ్జిట్ పోల్స్ తో మరింత షాక్
పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా హర్యానా నుంచి బీజేపీ నిష్క్రమణ ఖాయమని చెప్పాయి. ఇక హర్యానా ఓటమి తరువాత, ప్రధాని మోడీ గ్రాఫ్ తగ్గుతున్నందున సంఘ్ కూడా కీలక నిర్ణయం తీసుకుంటుందనే చర్చ సాగింది. మరోవైపు ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత కాంగ్రెస్‌లో మరింత ఉత్సాహం పెరిగింది. అదే సమయంలో హర్యానాలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని టీవీ చానెళ్లలో చర్చ ప్రారంభమైంది. అయితే మంగళవారం వెల్లడైన హర్యానా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ తో పాటు బీజేపీని షాక్ కు గురి చేశాయి. ప్రజలు మనస్పూర్తిగా బీజేపీని ఆదరించారు. హర్యానాలో 48 సీట్లతో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ 37 సీట్లకు పరిమితమైంది. ఈ విజయం తర్వాత మోడీ మ్యాజిక్ గురించి మరోసారి చర్చ మొదలైంది. కేవలం 20 రోజుల్లో బీజేపీకి మోదీ ఇంత భారీ విజయాన్ని ఎలా అందించారనే ప్రశ్న ఇప్పుడు అందరిలో మెదులుతున్నది.
సెప్టెంబర్ 14న కురుక్షేత్రలో మోదీ తొలి ర్యాలీ
ఈసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కోసం పోరు చాలా ఆసక్తికరంగా సాగింది. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఈసారి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ వ్యతిరేకతను అధిగమించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 14న కురుక్షేత్రలో ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అప్పటికి ఎన్నికలకు కేవలం రోజుల సమయం మాత్రమే ఉంది. అతి తక్కువ సమయంలో ఓటర్లను తమవైపు తిప్పుకోవడం పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ పెద్ద సవాల్‌గా కనిపించింది. హర్యానాలో విజయం బీజేపీ మనుగడకు కీలకమని ప్రధాని మోదీకి తెలుసు. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ఫలితాల తర్వాత ప్రధాని మోదీలో కూడా మునుపటి దూకుడు కనిపించలేదు. కూడా కాస్త అలసిపోయినట్లు కనిపించారు.
టార్గెట్ కాంగ్రెస్
ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, తక్కువ సమయంలో హర్యానాలో విజయం సాధించేందుకు ప్రధాని మోదీ పక్కా వ్యూహాలు రచించారు. ఈ వ్యూహంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. ప్రధాని మోదీ పక్కా వ్యూహంతో ప్రచార ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రధాని మోడీ కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. తన ఎన్నికల ప్రసంగాలల్లో కాంగ్రెస్, రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ సమయంలో ప్రధాని మోదీ ప్రసంగాలకు జనాలు విసుగెత్తిపోయారనే చర్చ జరిగింది. హర్యానాలో బీజేపీ గెలుపు అసాధ్యమని అనే చర్చ సాగింది. అయితే ఫలితాలు మాత్రం కాంగ్రెస్ ను గతంలో ఎన్నడూ లేనంతగా షాక్ కు గురి చేశాయి. హర్యానాలో గెలుపు తర్వాత కూడా ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై మరో సారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.