Tibet : టిబెట్ మీదుగా విమానాలు ఎందుకు ఎగరవు.. ఆ సీక్రెట్ ఏంటో తెలుసా ?

Tibet

Tibet

Tibet : టిబెట్ మీదుగా విమానాలు ఎగరవని మనం తరచూ వింటూనే ఉంటాం. అయితే ఆ ప్రాంతం పై విమానాలు ప్రయాణించడానికి ఎందుకు అనుమతించరో మాత్రం చాలా మందికి తెలియదు. టిబెట్ మీదుగా విమానాలు ఎగరకపోవడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో ఒకటి ప్రధానంగా వాతావరణ ప్రతికూలత. ఎవరెస్ట్ శిఖరం సరిహద్దును నేపాల్‌ టిబెట్‌తో ఉంటుంది. అధిక పీఠభూముల కారణంగా ఈ ప్రదేశాలను ‘రూఫ్ ఆఫ్ ది వరల్డ్’ అని పిలుస్తారు. ఇక్కడ ఎత్తైన పర్వతాలు ఉన్నందున విమానాల ప్రయాణం చాలా ప్రమాదమని నిపుణులు చెబుతుంటారు. ఇక్కడ ఎత్తైన పర్వతాలు ఉండటం వల్ల విమాన ఇంజిన్‌లో సమస్యలు వస్తాయి. సాధారణంగా విమానం 20 వేల అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది. కానీ ఎవరెస్ట్ పర్వతం దగ్గర అది సాధ్యపడదు..

ఇది కాకుండా టిబెట్ అల్ప పీడన ప్రాంతం. ఇక్కడ గాలి కొరత తీవ్రంగా ఉంటుంది. విమానాలు ఎగరాల్సి వస్తే.. అందులో కూర్చున్న ప్రయాణికులకు ఆక్సిజన్ కొరత ఉంంటుంది.  అత్యవసర సమయంలో 15-20 నిమిషాలు మాత్రమే అందులోని సిబ్బంది ప్రయాణికులకు ఆక్సిజన్‌ను అందించగలరు.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకోవాలంటే విమానం పర్వతాల కన్నా తక్కువ ఎత్తులో ప్రయాణించాల్సి ఉంటుంది. విమానానికి సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి వీటి ప్రకారం.. 10,000 అడుగుల ఎత్తు వరకు ఎగరవచ్చు.. కానీ ఈ ప్రాంతంలో ఇంత ఎత్తులో ఎగరడం అసాధ్యం. విమానం తక్కువ ఎత్తులో ఎగిరితే.. అది ఎత్తైన పర్వతాలను ఢీకొట్టే ప్రమాదం ఉంది. మీరు పర్వతాల పైన ఎగురుతుంటే ఆక్సిజన్ కొరత ఉంటుంది. అందుకే ఇక్కడ విమాన ప్రయాణం అంత మంచిది కాదు…

TAGS