Olympic winner : ఒలింపిక్ విజేతను గౌరవించేది ఇలాగేనా?  ఓ విజేత తండ్రి అసహనం

Olympic winner

Olympic winner

Olympic winner Prize Money : పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన షూటర్ స్వప్నిల్ కుసాలే తండ్రి.. తన కొడుకుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.2 కోట్ల ప్రైజ్ మనీపై నిరాశ అసహనం వ్యక్తం చేశాడు. తన కొడుకు ఇంతకంటే ఎక్కువ డబ్బుకు అర్హుడని పేర్కొన్నారు. కొల్హాపూర్‌కు చెందిన 29 ఏళ్ల స్వప్నిల్ కుసాలే ఆగస్టులో జరిగిన పారిస్ ఒలింపిక్ గేమ్స్ లో  షూటింగ్ విభాగంలో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో భారతదేశానికి కాంస్య పతకం తెచ్చిపెట్టాడు.

తన కొడుకుకు రూ. 5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీతో పాటు పుణేలోని బలేవాడిలోని గల  ఛత్రపతి శివాజీ మహారాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర ఫ్లాట్ ఇవ్వాలని స్వప్నిల్ కుసాలే తండ్రి సురేష్ కుసాలే డిమాండ్ చేశారు. ‘హర్యానా ప్రభుత్వం తమ (ఒలింపిక్ పతక విజేత) ప్లేయర్లకు రూ. 5 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు.  ‘మహారాష్ట్ర ప్రభుత్వ నూతన పాలసీ ప్రకారం ఒలింపిక్ కాంస్య పతక విజేతకు రూ.2 కోట్లు ఇస్తున్నది. గత 72 ఏళ్లలో (1952లో మల్లయోధుడు కేడీ జాదవ్ తర్వాత) మహారాష్ట్ర నుంచి వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్ పతకం సాధించిన వారిలో స్వప్నిల్ రెండో స్థానంలో ఉన్నారు.

హర్యానా ప్రభుత్వం బంగారు పతక విజేతకు రూ.6 కోట్లు, రజత పతక విజేతకు రూ.4 కోట్లు, కాంస్య పతక విజేతకు రూ.2.5 కోట్లు ఇవ్వడం గమనార్హం. ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వం వరుసగా రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు, రూ. 2 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించింది.

అయితే  సురేశ్ కుసాలే  మాత్రం తన కొడుకు ‘స్వప్నిల్‌కు బహుమతిగా రూ. 5 కోట్లు,  బాలెవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర ఫ్లాట్ కావాలని కోరాడు. దీంతో సులభంగా ప్రాక్టీస్‌కు వెళ్లొస్తాడని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ కాంప్లెక్స్‌లోని 50 మీటర్ల రైఫిల్3 పొజిషన్ షూటింగ్ ప్రాంతానికి స్వప్నిల్ పేరు  కూడా  పెట్టాలని డిమాండ్ చేశాడు.

TAGS