Hamas : హమాస్ చెరలోని బందీలను విడుదల చేయాలి: అమెరికా
Hamas : గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడులు జరిపి వేల మందిని పొట్టనబెట్టుకుంది. ఈ ఘటన జరిగి ఏడాది కావస్తోంది. ఈ ఘటనలో వేల మంది మృతి చెందగా, కొందరిని హమాస్ బంధించింది. ఇప్పటికీ వారు హమాస్ చెరలోనే బందీలుగా ఉన్నారు. అయితే హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని అమెరికా పిలుపునిచ్చింది. చెరలో ఉన్న బందీలను వారి కుటుంబాలకు సురక్షితంగా చేరవేసినంత వరకు శ్రమిస్తామని అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో వెల్లడించారు.
గత ఏడాది అక్టోబరు 7న జరిగిన దాడుల్లో 46 మంది అమెరికన్లు మరణించగా, 19 మంది అమెరికన్లు ఉన్నారని మాథ్యూ మిల్లర్ తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన మృతులకు సంతాపం తెలియజేస్తూ, బందీలను బయటకు తీసుకు రావడానికి శ్రమిస్తామని తెలిపారు. బందీలను బయటకు తీసుకు రావడానికి కాల్పుల విరమణ ఒప్పందానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.