Prabhas : త్వరలోనే ప్రభాస్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన పెద్దమ్మ శ్యామలా దేవీ

Prabhas

Prabhas

Prabhas Wedding : టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి విషయంలో మరింత స్పష్టత వచ్చేసింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తరుణం త్వరలోనే రానుందని ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి చెప్పారు. నవరాత్రుల నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. అందరూ ఎదురుచూస్తున్న ముహూర్తం త్వరలోనే రానుందని పేర్కొన్నారు.

అమ్మవారి ఆశీస్సులతోపాటు పై నుంచి కృష్ణంరాజు గారి దీవెనలు కూడా ప్రభాస్‌పై ఎప్పటికీ ఉంటాయన్నారు. ప్రభాస్ పెళ్లిపై ఆమె క్లారిటీతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కాబోయే వదిన ఎవరో? అంటూ అప్పుడే నెట్టింట్లో వెతుకులాట షురూ చేశారు. కాగా, ప్రభాస్ వరుసగా సలార్, ‘కల్కి 2898 ఏడీ’ మూవీలతో భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలకు సీక్వెల్ రానుండగా, ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీలో నటిస్తున్నాడు.

TAGS