KTR tweet : ఈ సోకులు ఎవరి కోసం రేవంత్.. కేటీఆర్ ట్వీట్..

KTR tweet

KTR tweet

KTR tweet : కొన్ని రోజులుగా కేటీఆర్ తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. పాలక పక్షంలోని ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలోని కేటీఆర్ ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. సూటిగా ఎదుర్కొనకుండా సోషల్ మీడియా, తదితర మాధ్యమాల ద్వారా కూడా అటాక్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు.. ఆ పార్టీ నాయకులు సైతం గందరగోళానికి గురవుతున్నారు. కేటీఆర్ వలలో చిక్కిన చాప మంత్రి కొండా సురేఖ. తన పార్టీ కార్యకర్తలతో ఆమెను విపరీతంగా ట్రోల్ చేయడంతో తీవ్రంగా ఆగ్రహానికి గురైన కొండా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వంగా మారింది.

ఇది చిలికి చిలికి గాలివనలా మారింది. మరో సారి సమంత, అక్కినేని కుటుంబం, ఎన్-కన్వెన్షన్ గురించి స్పందించింది. ఇదైతే మరింత ఆగ్రహానికి గురి చేసింది. ఒక ఆడది అయ్యుండి మరో ఆడదానిపై ఇలా నిందలు వేస్తారా? అంటూ సొంత పార్టీ వారే పెదవి విరించారు. ఈ విషయంలో మళ్లీ కేటీఆర్ కల్పించుకొని సురేఖ మాటలు తనను బాధించాయని మొసలి కన్నీరు వలకబోశారు. ప్రతిపక్షంలో ఉంటూ ఏదైనా చేయవచ్చని నిరూపించారు కేటీఆర్.

హైడ్రా విషయంలో ఎప్పటి నుంచే ఫైర్ అవుతున్న కేటీఆర్ ఇటీవల మూసీ సుందరీకరణ గురించి సీఎంకు ట్వీట్ చేశారు. గతంలో ప్రభుత్వం వద్ద రూపాయి లేదు.. అన్నీ అప్పులే ఉన్నాయని బీఆర్ఎస్ ప్రభుత్వంను విమర్శించిన రేవంత్ మరి మూసీ సుందరీకరణకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకువచ్చారని ప్రశ్నించారు. రూ. 1.50 లక్షల కోట్లు ఎందుకని అనవసరంగా పేదల ఇండ్లు కూలుస్తున్నారని ఆగ్రహించారు. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీ రైతు రుణమాఫీ చేసేందుకు డబ్బులు లేవు అని చెప్తూనే సుందరీకరణ పేరుతో కోట్లు ఎలా ఖర్చు పెడతారని నిలదీశారు.

TAGS