Jakkanna : జక్కన్న  ప్లానింగే వేరు..మహేశ్ సినిమాతో ఏకంగా రూ.3వేల కోట్లకు టార్గెట్

Jakkanna

Jakkanna

Jakkanna :  పాన్ ఇండియా లెవెల్ లో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబీ 29 .. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆశాన్నంటుతున్నాయి.. మహేష్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుంది.. ప్రేక్షకులు ముందుకు ఎప్పుడు వస్తుందం సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

సినిమా మేకింగులో జక్కన్న ప్లానింగే ఏ వేరు. సినిమాలో ప్రతి ఒక్కదాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు . ఒక్కసారి కనుక ఆయన ప్రాజెక్ట్ ఒప్పుకుంటే.. ఇక ఆ హీరోను ఎన్నేళ్లకు స్క్రీన్ మీద చూపిస్తాడే తెలియదు కానీ  లేట్ అయినా..  కరెక్ట్ కట్ అవుట్ ని స్క్రీన్ మీద దింపుతాడు. పని విషయంలో చాలా కఠినంగా ఉంటాడని.. పని రాక్షసుడని ఇప్పటికే ఎంతో మంది నోటి నుంచి విన్నాం. పనిలో అంత పర్ఫెక్ట్ గా ఉన్నాడు కాబట్టే.. తన సినిమాలకు ఆ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు తన కెరీర్లో ఒక్క ఫ్లాపు పడలేదంటే జక్కన్న కమిట్ మెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జక్కన్న చేతిలో పడితే ఆ హీరో దశ తిరగాల్సిందే. హిస్టరీలో గుర్తుండిపోయే హిట్స్ ఇస్తూ ఉంటాడు జక్కన్న. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో సినిమా తీస్తున్న సినిమా వసూళ్ల విషయంలో మహేష్ తో భారీ టార్గెట్ నే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

సినిమాను  తీయడం ఒకెత్తయితే.. దానిని మార్కెటింగ్ చేసి హైప్ పెంచడం మరొక ఎత్తు. ఈ రెండింటిలోనూ రాజమౌళి దిట్ట. ఈ విషయంతో ఆయనను కొట్టే వారు ఇప్పటివరకు రాలేదు. ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ తో ఇది అందరికి అర్థమైంది. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తీసి అందరిని అబ్బురపరిచాడు. రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలనీ.. చాలా మంది బాలీవుడ్ హీరోల కోరిక. బాలీవుడ్ లోనే కాదు.. సౌత్ లో కూడా ఇతర భాషల్లో స్టార్స్ రాజమౌళి కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సాధారణంగానే రాజమౌళికి ఒక్కో సినిమాకు ఒక్కో టార్గెట్ ఉంటూ ఉంటుంది. ఇలా పక్కా లెక్కలతో ముందుకు వెళ్లే జక్కన్న.. ఈసారి ఏకంగా ఈసారి మహేష్ తో భారీ వసూళ్లను రాబట్టాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే సినిమా కోసం మహేష్ లుక్ ను పూర్తిగా మార్చేశాడు. రీసెంట్ గా ఆ ఫోటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. జక్కన్న ఈ సారి ప్లానింగ్ ను మాత్రం అస్సలు ఊహించి ఉండరు. ఎందుకంటే ఈసారి జక్కన్న టార్గెట్ ఏకంగా రూ.3 వేల కోట్లు.

ప్రస్తుతానికి రూ.1200 కోట్లతో ప్రభాస్ నటించిన కల్కి సినిమా టాప్ లో ఉంది. రెండేళ్లు పూర్తయ్యే లోపు  ప్రభాస్ ఆ రికార్డ్ ను దాటేసి రెండు వేల వరకు చేరిన ఆశ్చర్యం లేదు. అందుకే జక్కన్న ఏకంగా 3 వేల కోట్ల టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే జక్కన్న హిస్టరీలో ఇది మరో రికార్డ్ క్రియేట్ చేస్తుందని చెప్పి తీరాల్సిందే. పైగా ఈ సినిమాకు డబ్బింగ్ ను అన్ని భాషల్లోనూ మహేష్ తోనే చెప్పించాలని కూడా డిసైడ్ అయ్యాడట. అంతే కాకుండా ఈ సినిమాకు నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లను పెట్టనున్నాడట జక్కన్న.. అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు టాక్. పైగా ఈ సినిమా షూటింగ్ అంతా కూడా విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారట. టాలీవుడ్ లో ప్రమోషన్స్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎలాగూ జక్కన్న మార్కెట్ కు తిరుగులేదు. సో అందుకే ఇప్పుడు హాలీవుడ్ కు గురి పెట్టాడు జక్కన్న. ఇప్పటికే హాలీవుడ్ లో ప్రమోషన్స్ ఎలా చేయాలో కూడా ప్లాన్ ఫిక్స్ అయిందట. ఇక కొడితే 3 వేల కోట్లు వచ్చి పడాల్సిందే.

TAGS