suicide : నిజామాబాద్ లో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

suicide

suicide

suicide Family : నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. దంపతులతో పాటు వారి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్ లైన్ గేమ్స్ కు బానిసగా మారిన కుమారుడు రూ.30 లక్షల వరకు అప్పులు చేయడంతో వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులుతో పాటు వారి కుమారుడు ఇంట్లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన సురేశ్ (53), హేమలత (45) దంపతులు కాగా, వీరి కుమారుడు హరీష్ (22) గత కొంత కాలంగా ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో పబ్జీ గేమ్ లో రూ.30 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలిసింది. ఆ అప్పులు తీర్చేందుకు సురేశ్ తనకున్న పొలం కూడా అమ్మివేశారు. అయినప్పటికి అప్పులు తీరకపోవడంతో మనస్తాపంతో గత రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

TAGS