Hanu Raghavapudi : ప్రభాస్ సినిమా దర్శకుడు హను రాఘవపూడి కి చాలా భయం… ఏ విషయంలో తెలుసా?

Hanu Raghavapudi

Hanu Raghavapudi

Hanu Raghavapudi : ప్రభాస్ హీరోగా త్వరలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పౌజి, సీతారామం తీసిన తర్వాత హను రాఘవపూడి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. సీతారామం లాంటి లవ్ స్టోరీ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఎంతోమంది ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి.

ఈ మూవీ ద్వారా డైరెక్టర్ గా హను రాఘవపూడి తనేంటో నిరూపించుకున్నాడు. దీంతో ప్రభాస్ దృష్టి లో పడ్డాడు. ప్రస్తుతం ప్రభాస్ తో హను రాఘవపూడి ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ స్పిరిట్ మూవీ కూడా చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్నారు. స్పిరిట్ మూవీ కంటే ముందే రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా ముందే రానుంది అని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే సెట్స్ మీదికి సినిమాను తీసుకెళ్లడానికి అన్ని ప్రయత్నాలు జరిగిపోయాయి అని తెలుస్తోంది. అయితే ప్రభాస్ సలార్ టు స్పిరిట్ లాంటి పెద్ద మూవీలు చేస్తూ ఇటు రాఘవపూడి చిత్రంలో కూడా నటిస్తున్నారు. ప్రభాస్ చేతిలో అర డజనులకు పైగా సినిమాలు ఒకేసారి ఉండడంతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. అయితే హను రాఘవపూడికి ఒక ఫోబియా ఉందట. ఎక్కువగా నీళ్లు చూస్తే భయపడిపోతాడంట.

అందుకే నీళ్లు లేని ప్రదేశంలోనే షూటింగ్ లు పెట్టుకుంటున్నారు. ఈ షూటింగ్ ల వల్ల అతనికి అసౌకర్యం లేకుండా చూసుకుంటున్నాడు.  అందుకే లొకేషన్లలో నీళ్లు ఎక్కువగా లేకుండా చూసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక స్టార్ డైరెక్టర్ అయి ఉండి చిన్నపిల్లల వాటర్ కు భయపడడం ఏంటి అని చాలామంది  ప్రశ్నిస్తున్నారు.

అయితే ప్రతి ఒక్కరికి ఒక ఫోబియా ఉంటుంది. అలాంటిదే హను రాఘవపూడి కి కూడా నీళ్ల భయం అనే ఫోబియా ఉందని తెలుస్తోంది. అయితే హను రాఘవపూడి ప్రభాస్ ని సరికొత్త యాంగిల్ లో చూపించేందుకు ముందుకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

TAGS