Konda Surekha Issue : కొండా వ్యవహారంపై బాస్ స్పందిస్తారా..? మంత్రివర్గ విస్తరణలో ఆమె గతేంటి?
Konda Surekha Issue : కొన్ని రోజులుగా ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ కొనసాగుతోంది. రెండు పార్టీల మధ్య తలెత్తిన వ్యవహారంలోకి అక్కినేని కుటుంబాన్ని లాగి తెలంగాణ నోటిలో పడేసింది కొండా సురేఖ. ఏ నోట విన్నా పాపం అక్కినేని అని వినిపిస్తోంది. డ్రగ్స్ దగ్గరి నుంచి ఎన్-కన్వెన్షణ్ కూల్చివేతకు సమంతను అంటకట్టడం ఏ మాత్రం బాగోలేదని, ఒక మహిళా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారునాతి దారుణమని ప్రతీ ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తురన్నారు. ఈ నేపథ్యంలో ముందున్న మంత్రివర్గ విస్తరణలో కొండా సురేఖ మంత్రి పదవిని తొలగిస్తారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
సోషల్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్తలు నిజమైతే టాలీవుడ్ అక్కినేని కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిళా మంత్రి కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ట్యాగ్ చేస్తూ సురేఖ వ్యాఖ్యలపై అమల అక్కినేని ఆగ్రహంతో ట్వీట్ చేయడంతో ఈ వ్యవహారం అధిష్టానం దృష్టికి వెళ్లింది.
ప్రియాంక గాంధీ అమల అక్కినేనికి ఫోన్ చేసి మొత్తం ఎపిసోడ్ గురించి ఆరా తీసినట్లు సమాచారం. సురేఖ వ్యాఖ్యలు చాలా దారుణంగా, అవమానకరంగా ఉన్నాయని, ఇది అక్కినేని కుటుంబం ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఆమె కూడా భావించినట్లు సమాచారం. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగిస్తే బాగుంటుందని ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అది పార్టీ, ప్రభుత్వం ఇమేజీని పెంచుతుంది.
సురేఖ వ్యాఖ్యలకు దారితీసిన అసలు కారణాలను రేవంత్ రెడ్డి ఆమెకు వివరించినప్పటికీ ప్రియాంక ఒప్పుకోలేదు. సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించి, ఆమె స్థానంలో మరో ఓబీసీ నేతను, ముఖ్యంగా మరో మహిళను నియమించాలని ఆమె కోరినట్లు తెలిసింది. పార్టీకి జరిగిన నష్టాన్ని నియంత్రించడానికి ఇంతకంటే మంచి మార్గం లేదని, ఈ విషయం బాలీవుడ్ వరకు వ్యాపించే అవకాశం ఉందని. ఆ తర్వాత దేశ వ్యాప్త సమస్యగా మారే అవకాశం ఉందని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే త్వరలోనే మంత్రివర్గ విస్తరణలో రేవంత్ హైకమాండ్ ఆదేశాలను పాటించే అవకాశం ఉందని సమాచారం.