Tirumala Laddu case : తిరుమల లడ్డూ వ్యవహారం.. సీబీఐ సహా ప్రత్యేక కమిటీతో విచారణకు ‘సుప్రీం’ ఆదేశాలు

Tirumala Laddu case

Tirumala Laddu case

Tirumala Laddu case : తిరుమల లడ్డూ వివాదం దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లడ్డూ వివాదంపై ఈరోజు (శుక్రవారం) సుప్రీం కోర్టులో కేంద్రం తమ అభిప్రాయం స్పష్టం చేసింది. సిట్ ఈ కేసు తేల్చలేదని, కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు నివేదించారు. కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. దీంతో, సుప్రీంకోర్టు సీబీఐ, ఏపీ ప్రభుత్వంతో సహా అయిదుగురితో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరితో ఈ సంస్థ విచారణ చేసేలా ప్రతిపాదించారు. ఈ వ్యవహారంపై రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని నిర్దేశించారు. ఈ కమిటీ పూర్తిస్థాయిలో ఏర్పాటైన తర్వాత తిరుమల లడ్డూ వ్యవహారంపైన విచారణ జరుపనుంది.

TAGS