AP Deputy CM Pawan : సమంత – కొండా సురేఖ ఇష్యూ.. స్పందించని ఏపీ డిప్యూటీ సీఎం పవన్?

AP Deputy CM Pawan

AP Deputy CM Pawan

AP Deputy CM Pawan : ప్రస్తుతం కొండా సురేఖ వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకమై ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నాగార్జున ఏకంగా ఆమెపై పరువు నష్టం దావా వేశారు.  దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి తర్వాత పరిశ్రమకు పెద్దదిక్కుగా ఆ బాధ్యతలను మెగాస్టార్ చిరంజీవి తన  భుజస్కందాలపై వేసుకున్నారు. మొన్నటికి మొన్న వైసీపీ హయాంలో టికెట్ల వివాదం పై లీడ్ రోల్ తీసుకుని మరి అప్పటి సీఎం జగన్ ను కలిశారు. చిత్ర పరిశ్రమ కోసం సీఎం జగన్ ను చేతులు జోడించి అడగడం అప్పట్లో వివాదాస్పదం అయింది. చిరంజీవికి ఘోర అవమానం జరిగిందని ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.

అయితే ఇప్పుడు తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ రెండు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆమె వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. సమంత, నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని చెబుతూ.. కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో తీవ్రమైన, అనరాని మాటలను అనేశారు కొండా సురేఖ. ఎన్.కన్వెన్షన్ కూల్చివేయకుండా ఆపాలంటే సమంతాను తన దగ్గరకు పంపించాలని కేటీఆర్ అడిగారని బాంబు పేల్చారు. సమంతను కేటీఆర్ వద్దకు వెళ్లాలని నాగార్జున, నాగచైతన్య ఒత్తిడి తెచ్చారని.. అందుకు సమంత ఒప్పుకోకపోవడంతోనే ఆమెకు విడాకులు ఇచ్చారని సురేఖ షాకింగ్ కామెంట్లు చేశారు. అయితేఈ వ్యాఖ్యలపై నాగార్జున కుటుంబంతో పాటు యావత్ సినీ పరిశ్రమ అంతా స్పందించింది. చివరకు మెగాస్టార్ సైతంస్పందించి ఖండించారు. ఇంత జరుగుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

గతంలో ఇండస్ట్రీ తరఫున పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో తనను ఉద్దేశించి సినీ పరిశ్రమను ఇబ్బంది పెడితే తాను కచ్చితంగా స్పందిస్తానంటూ  చెప్పుకొచ్చారు. కానీ ఓ కుటుంబాన్ని ముఖ్యంగా ఓ మహిళ, హీరోయిన్ ను ఇలా బయటకు లాగడంపై ఇంతవరకు స్పందించలేదు. సినీ పరిశ్రమలో చాలామంది ఆయన తీరుపై స్పందించారు.   తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

TAGS