Sadhguru : సద్గురు సంచలనం.. మద్రాస్ హైకోర్టు దెబ్బతో సుప్రీంకోర్టుకు పరుగో పరుగు
Sadhguru : ఈషా ఫౌండేషన్ తన కూతుళ్లకు బ్రెయిన్ వాష్ చేసి సన్యాసులుగా మార్చి ఫౌండేషన్ లో ఉంచారని, వారిని ఖైదీలుగా చూస్తున్నారని, కుటుంబ సభ్యులతో కలువనివ్వడం లేదని డాక్టర్ ఎస్ కమరా అనే రిటైర్డ్ ప్రొఫెసర్ మద్రాస్ హైకోర్టులో హెబియస్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై స్పందించిన కోర్టు అసలు ఫౌండేషన్ లో ఏం జరుగుతుందో సోదాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 150 మంది పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు. తాము ఎవ్వరినీ సన్యాసులుగా మార్చడం లేదని, ఎవరి జీవితం వారి ఇష్టం అని ఫౌండేషన్ కోర్టుకు వివరించింది. ఈ హేబియస్ పిటిషన్ ను సవాల్ చేస్తూ ఇషా ఫౌండేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఇషా ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్‌తో సదరు యువతులు ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సెషన్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతులు మాట్లాడుతూ సద్గురు ఈషా ఫౌండేషన్‌లో తాము ‘ఇష్ట పూర్వకంగా’ ఉంటున్నట్లు న్యాయమూర్తులకు వివరించారు.
తన తండ్రి ఆరోపణలపై ఒక కూతురు స్పందిస్తూ తమ తండ్రి ‘ఎనిమిదేళ్లుగా తప్పుడు ఆరోపణలు చేస్తూ తమను వేదిస్తున్నాడు’ అని సుప్రీంకోర్టుకు తెలిపింది. అంతే కాకుండా తనను, తన సోదరిని నకిలీ క్లెయిమ్‌లతో వేధిస్తున్నాడని ఒక సోదరి పేర్కొంది. ఈషా ఫౌండేషన్ తరుఫున న్యాయవాది ముకుల్ రోహత్గీ న్యాయస్థానంలో హాజరవుతున్నారు. అయితే, రెండు రోజుల క్రితం పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఫౌండేషన్ లోపలికి చొచ్చుకువచ్చిన తీరు బాగా లేదని ఫౌండేషన్ తరుఫు న్యాయవాది ధర్మాసనంకు వివరించారు.