Ramgopal Varma : నాతో శృంగారం చాలు అని ఏ హీరోయిన్ అనదు : రాంగోపాల్ వర్మ
ఆర్జీవీ తన ప్రాజెక్ట్‌లకు పైసా ఖర్చు లేకుండా హైప్ తెచ్చుకుంటాడు. కొందరు దర్శకులు కూడా తమ సినిమాకు అలా పబ్లిసిటీ రావడం లేదని కుళ్లుకుంటూ ఉంటారు. కొన్నేళ్లుగా ఆర్జీవీ బయోపిక్స్, కాంట్రవర్సీ సబ్జెక్ట్‌లతోనే సినిమాలు చేస్తున్నారు. పలు సందర్భాల్లో ఆయనపై ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా వాటికి పరిగణనలోకి తీసుకోడు. అలా బెదిరిస్తే ఇంకో అడుగు ఎక్కువే వేస్తుంటాడు.
సమాజ:లో కొందరు ఆయనను పిచ్చోడంటే, వర్మ అభిమానులు మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛను సంపూర్ణంగా అనుభవించే ఏకైక వ్యక్తి అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఎవరెన్ని రకాలుగా విమర్శించినా.. వర్మ కు ఉన్న క్రేజ్ మరింత పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఆయన సినిమాలు తీయకపోయినా తన పాపులారిటీకి మాత్రం ఇంకా పెరుగుతున్నది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ సెక్స్ పై బోల్డ్ కామెంట్లు చేశాడు. శృంగారం, వర్జినిటీ లాంటి అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు తాను 17, 18 ఏళ్లు ఉన్నప్పుడే వర్జినిటీని కోల్పోయానంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బెడ్‌పై ఒక అబ్బాయి శృంగారంలో పాల్గొనే సామర్థ్యాన్ని అంచనా వేయడం చాలా కష్టంమని చెప్పాడు. సెక్స్ చేస్తున్న సమయంలో ఇక చాలు ఆపు అని ఏ అమ్మాయి ఇంతవరకు నాతో తనతో చెప్పలేదన్నారు. డేట్‌కు వెళ్లడం కూడా నచ్చదు, ఏదైనా కానీ ఇంట్లోనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలేనా ఆంటీలను కూడా ఇష్టపడతారా అని యాంకర్ ప్రశ్నించగా ఇద్దరూ కావాలంటూ మరింత హాట్ కామెంట్స్ చేశాడు వర్మ. అబ్బాయిలు ఆంటీలనే ఎందుకు ఇష్టపడతారనే మరో ప్రశ్నకు.. ‘ఎవరిలో ఉండే అట్రాక్షన్ వారిలో ఉంటుందని, అనుభవం ఉన్న వాళ్లు ఏ రంగంలోనైనా డామినేట్ చేస్తారని, ఇక్కడా అదే సూత్రం వర్తిస్తుందని ఆర్జీవీ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఆర్జీవీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.