Konda Surekha : చైతన్య, సమంత విడాకులకు కారణం బయటపెట్టిన కొండా సురేఖ..

Konda Surekha

Konda Surekha Comments on Samantha Naga Chaitanya Divorce

Konda Surekha Comments : తెలంగాణలో కొన్ని రోజులుగా కొండా వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ జరుగుతోంది. కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీ విపరీతమైన ట్రోల్ చేసింది. ఈ విషయంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా కొండాకు సపోర్ట్ చేశాడు. ఒక మంత్రి, ఆడ బిడ్డను ఇలా ట్రోల్ చేయడం బీఆర్ఎస్ కు మంచిది కాదని సూచించారు. పార్టీ, పనులపై విమర్శలు ఉడాలని కానీ, వ్యక్తిగత విమర్శలు మంచిది కాదన్నారు. దీనిపై తను పర్సనల్ గా కేసు వేస్తానని కూడా అన్నారు.

ఈ ట్రోలింగ్ వ్యవహారంపై కొండా సురేఖ కూడా విపరీతంగా ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఆమె పోరాటంలో భాగంగా, ఆమె కేటీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం కూడా కేటీఆరేనని ఆరోపించారు. మహిళలు, హీరోయిన్లకు డ్రగ్స్‌కు అలవాటు చేశాడన్నారు. వ్యక్తి గత సమాచారం కోసం వారి ఫోన్లను ట్యాప్ చేసే వాడని, అతనికి ఇంట్లో తల్లి, చెల్లి, భార్య లేరా..? అతను స్త్రీలను గౌరవించడు, విలువ ఇవ్వడు’ అని కొండా సురేఖ అన్నారు.

బీఆర్ఎస్ దాడి నేపథ్యంలో తోటి కాంగ్రెస్ నేతలు ఆమెపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకులు కూడా ఆడబిడ్డతో అలా ప్రవర్తించడం మంచిది కాదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మద్దతుదారులు మాత్రం కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ కొండా సురేఖ హద్దులు దాటుతుందని అంటున్నారు.

TAGS