Trupti Dimri : వివాదంలో చిక్కుకున్న యానిమల్ భామ తృప్తి డిమ్రీ
Trupti Dimri : ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా అవతరించింది తృప్తి డిమ్రీ. యానిమల్ సినిమాలో చేసిన బోల్డ్ క్యారెక్టర్ తో కుర్రాళ్ల హాట్ ఫేవరేట్ గా మారింది. అదే సమయంలో ఆ క్యారెక్టర్ చేసినందుకు తీవ్ర విమర్శలు సైతం ఎదుర్కొంది. కానీ తృప్తి ఇవేమీ పట్టించుకోకుండా తన తదుపరి చిత్రాల వైపు దృష్టి సారించింది.
త్రిప్తి తాజా చిత్రం ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ రిలీజ్ కు దగ్గరలో ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉంది. కాగా, తృప్తి ఓ వివాదంలో చిక్కుకుంది. తాము డబ్బు చెల్లించినా తమ ఈవెంట్ కు రాలేదని జైపూర్‌కు చెందిన ఈవెంట్ నిర్వాహకులు ఆరోపించారు.
జైపూర్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు తృప్తి డిమ్రీ రూ.5.5 లక్షలు తీసుకున్నందట. తీరా ఆ కార్యక్రమానికి హాజరుకాలేదని ఈవెంట్ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. రెడ్డిట్‌లో వైరల్ అవుతున్న వీడియోలో, కొంతమంది మహిళలు త్రుప్తిపై ఆరోపణలు చేస్తున్నారు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తృప్తి డిమ్రీ రూ. 5.5 లక్షలు ఇచ్చినా ఈవెంట్‌కు డుమ్మా..
వాస్తవానికి, తృప్తి తన తాజా చిత్రం ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ ప్రమోషన్ కోసం జైపూర్‌లో ఒక ఈవెంట్‌కు హాజరు కావాల్సి ఉంది. కానీ నటి ఈ కార్యక్రమానికి నిర్ణీత సమయానికి చేరుకోలేకపోయింది. దీంతో నిర్వాహకులు నటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిప్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తృప్తి సినిమాలను బహిష్కరిస్తామని నిర్వాహకులు డిమాండ్ చేశారు.
‘ఫిక్కీ ఫ్లో జైపూర్ చాప్టర్’ నిర్వహించిన ఈవెంట్‌కు తృప్తి మధ్యాహ్నం 1:30 గంటలకు చేరుకుంది. దీంతో ఆమె కోసం చాలాసేపు వేచి చూసినా తృప్తి, ఆమె బృందం ఈవెంట్‌కు రాకపోవడంతో నిర్వాహకులు వేదికపైకి ఎక్కి నిరసన తెలిపారు. ‘ఫిక్కీ ఫ్లో జైపూర్ చాప్టర్’ మాజీ చైర్పర్సన్ అల్కా బాత్రా వేదికపైకి వెళ్లి తృప్తి పోస్టర్‌పై బ్లాక్ స్కెచ్ తో మార్కింగ్ చేయడంతో ఈవెంట్లో దుమారం రేగింది.