Tamannaah : ‘వచ్చే ఏడాది పెళ్లి’.. మీడియా వార్తలపై ఫైర్ అయిన తమన్నా!

Tamannaah

Tamannaah and Vijay Varma

Tamannaah Marriage : తన వివాహం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై తమన్నా భాటియా కలత చెందారు. నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నానని ఆమె ఇప్పటికే ప్రకటించారు. అయితే తన కెరీర్ లైఫే కాకుండా పర్సనల్ లైఫ్ గురించి ఏదీ దాచుకోకుండా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా.. ఇలాంటి పుకార్లు సృష్టించడం ఏమీ బాగోలేదని అంటున్నారు.

అయితే, ఇటీవల ఆమె వివాహానికి సంబంధించి తేదీ, లొకేషన్ ఫిక్స్ అయ్యిందని కొన్ని వార్తా సంస్థలు, సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్ని చెప్తున్నా మళ్లీ ఇలాంటి పుకార్లు ఏంటని మండిపడుతున్నారు. వివాహం అనేది దాచే విషయం కాదు కదా? అని ఆమె అన్నారు. తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నా మీడియాకు తెలుస్తుంది కదా అని చెప్పుకచ్చారు.

నటుడు విజయ్ వర్మతో తమన్నా రిలేషన్ షిప్ లో ఉంది. వారు తమ సంబంధాన్ని దాచుకోలేదు. ఒకరిపై ఒకరు తమ ప్రేమ గురించి బహిరంగంగా ప్రకటించారు. తమన్నాకు సంబంధించిన 5 వేలకు పైగా ప్రైవేట్ ఫొటోలు తన వద్ద ఉన్నాయని, తామిద్దరం కలిసి బయటకు వెళ్లినప్పుడు మీడియా కెమెరాలకు తానెప్పుడూ దూరంగా ఉండనని విజయ్ వర్మ తెలిపాడు.

వచ్చే ఏడాది పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పినా తమన్నా మాత్రం డేట్ కన్ఫర్మ్ చేయలేదు. ప్రస్తుతం తమన్నా పెళ్లి కంటే సినిమాలు, వెబ్ సిరీస్ లపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం రెండు, మూడు ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయని ఆ ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత ఆలోచిస్తానని చెప్పుకచ్చింది.

TAGS