CM Chandrababu : నేటి నుంచి చెత్త పన్ను రద్దు : సీఎం చంద్రబాబు

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu : ఏపీలోని 5 కోట్ల మంది ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన చెత్త పన్నును పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఇకపై చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై కేబినెట్ లో కూడా చర్చించి ఆమోదిస్తామని ఆయన ప్రకటించారు.

గత ప్రభుత్వ హయాంలో చెత్తను సేకరించేందుకు గానూ ప్రతి ఇంటి నుంచి రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేశారు. దీనిపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చినా జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ప్రజల ముక్కు పిండి పన్ను వసూలు చేసింది. అయితే తాజా ప్రకటనతో సీఎం చంద్రబాబు చెత్త పన్నును తొలగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తాము చెత్త నుంచి సంపద సృష్టించాలని చూశామని, కానీ గత ప్రభుత్వం చెత్తపై పన్నేసింది. కానీ చెత్తను తొలగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే స్వచ్ఛ కార్యక్రమాల కోసం డ్రోన్ల వినియోగంపై కూడా పరిశీలిస్తామని, స్వచ్ఛ కార్మికులను మనందరం గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు.

TAGS