Tirumala Srivari programs : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ లో స్వామి వారికి జరిగే కార్యక్రమాలు ఇవే
Tirumala Srivari programs : కళియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయనను దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. ప్రతి నెల స్వామి వారికి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్టోబర్ నెలకు సంబంధించిన కార్యక్రమాలను తాజాగా టీడీడీ ప్రకటించింది అలాగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12 వరకు జరగనున్న దృష్ట్యా.. అక్టోబర్ 1వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఆ రోజు జరిగే అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ సమయంలో అన్ని దేవతా మూర్తులను, ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటికి తెచ్చి, కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన “పరిమళం” అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారరు. శ్రీవారి ప్రధాన మూర్తికి కూడా ఒక తెల్లని వస్త్రాన్ని కప్పి ఉంచుతారు.
అక్టోబర్ నెలలో జరిగే కార్యక్రమాలు ఇవే..
02 అక్టోబర్: మహాలయ అమావాస్య
03 అక్టోబరు: తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలకు మొక్కుల ప్రారంభోత్సవం
04 అక్టోబర్: ధ్వజారోహణం
08 అక్టోబర్: గరుడ సేవ
09 అక్టోబర్: సరస్వతీ పూజ, రాధరంగ డోలోత్సవం (బంగారు రథం)
అక్టోబర్ 10: చిత్రకార్తె
అక్టోబర్ 11: దుర్గాష్టమి, మహానవమి, రథోత్సవం
అక్టోబర్ 12: విజయదశమి, చక్రస్నానం, ధ్వజావరోహణం
అక్టోబర్ 13: భాగ్ సవారి
అక్టోబర్ 19: అట్లతద్దె
అక్టోబర్ 24: స్వాతికార్తె
25 అక్టోబర్: తిరుమల నంబి ఉత్సవం
28 అక్టోబర్: మనవాళ మహాముని జయంతి, సర్వ ఏకాదశి
అక్టోబర్ 30: మాస శివరాత్రి
31 అక్టోబర్: దీపావళి ఆస్థానం, వేదాంత దేశిక ఉత్సవం