CM Chandrababu : దర్యాప్తు సంస్థలతో సీఎం చంద్రబాబు సమావేశం

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu : రాష్ట్రంలోని దర్యాప్తు, విచారణ సంస్థలతో సెక్రటేరియట్ లో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో డీజీపీ సీఎస్ సహా వివిధ దర్యాప్తు సంస్థల అధినేతలతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భవగా మద్యం, గనులు, ఫైబర్ నెట్, భూ కబ్జాలు, మదనపల్లే ఫైల్స్ వంటి వాటిల్లో దర్యాప్తు పురోగతిపై చర్చించారు. ఇప్పటికే ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేశామని సీఐడీ అధికారులు సీఎం దృష్టి తీసుకెళ్లారు.

మరోవైపు మద్యం, ఫైబర్ నెట్, భూ కబ్జాల కేసుల్లో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అవినీతి వ్యవహారంపై విచారణపై సమీక్షలో ప్రస్తావించారు. మదనపల్లెలో తగులబడిన ఫైళ్ల ఘటన దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించారు. దర్యాప్తు వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్, విజిలెన్స్ డీజీ, సీఐడీ చీఫ్ హాజరయ్యారు.

TAGS