Snakes : ఈ పాముతో జాగ్రత్త సుమా?

Snakes

Snakes

Snakes : సముద్రంలో చాలా రకాల విష పురుగులు ఉంటాయి. వీటితో జాగ్రత్తగా ఉండాల్సిందే. విశాఖ నగర పరిధి సాగర్ నగర్ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు ఓ విషపూరిత పాము పడింది. అది కాటు వేస్తే ప్రమాదకరమే. దీని సాంకేతిక నామం హైడ్రో ఫిస్ సీ స్నేక్ అని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.శ్రీనివాస రావు పేర్కొన్నారు.

ఇది విషపూరితమైనది. కాటు వేసినప్పుడు సకాలంలో వైద్యం చేయించుకోకపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం. చిన్న చేపలు, రాళ్లలోని నాచు తింటూ మనుగడ సాగిస్తాయని చెబుతున్నారు. ఆహారం కోసం చేపల గుంపులో కలిసిపోయి అప్పుడప్పుడు వలకు చిక్కుతుంది. అలాంటి సందర్భాల్లో వలలో చిక్కుకుంటాయి. వీటితో డేంజరే. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

సుమారు ఏడడుగుల పొడవు ఉంటుంది. మత్స్యకారులు దీన్ని కట్ల పాము అని పిలుస్తుంటారు. మంగళవారం కనిపించిన దీన్ని మతస్యకారులు సురక్షితంగా సముద్రంలోనే విడిపెట్టారు. వలలో ఉన్నప్పుడే అలాగే దాన్ని వదిలేస్తారు. లేదంటే ప్రమాదకరం కావడంతో దాని నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు.

సముద్రంలో రకరకాల జంతువులు ఉండటం సహజం. వలలకు చిక్కడం సహజం. ఇలాంటి విష జంతువులు కనిపించినప్పుడు విడిచిపెట్టడమే బెటర్. లేకపోతే వాటితో మన ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటివి కనిపించినప్పుడు మళ్లీ సముద్రంలో విడిచిపెట్టడమే బాగుంటుందని పలువురు చెబుతున్నారు.

TAGS