Devara movie : దేవర మూవీ రిలీజ్ సందర్భంగా విశాఖలో అనూహ్య సంఘటన
Devara movie : దేవర మూవీ సెప్టెంబర్ 27 విడుదల కానుంది. రేపు మూవీ విడుదల ఉండడంతో ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటినుంచే సంబరా ల్లో మునిగిపోయారు. థియేటర్ల వద్ద కటౌట్లు కడుతున్నారు. రేపటి టికెట్ల కోసం ముందస్తు బుకింగ్ పెరిగిపోయాయి. అయితే దేవర మూవీ కోసం అందరూ అంతగా ఎదురు చూస్తుంటే విశాఖపట్నంలో ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.
దేవర మూవీకి సంబంధించి ఎన్టీఆర్ పోస్టర్లు విశాఖపట్నంలో ఆయా ప్రాంతంలో చిత్ర యూనిట్ అతికించింది. అయితే ఈ పోస్టర్ల వద్ద విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అంటూ జన జాగరణ సమితి వేరే పోస్టర్లను అంటించింది. జూనియర్ ఎన్టీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి సపోర్ట్ చేయాలని కోరుతూ ఇలా పోస్టర్లను అతికించారు.
దీంతో ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. దేవర సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాలు ఆపాదించకూడదని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాకుండా ఉద్యమంలో పాల్గొంటే అది ఎంతో బాగుంటుందని జన జాగరణ సమితి వారు భావిస్తున్నారు. కాగా శుక్రవారం ఉదయం దేవర సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీని కోసం చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసేసింది. జూనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ జంటగా నటించిన ఈ చిత్రంపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాలుగా ఒంటరిగా ఒక మూవీ చేసింది లేదు. కేవలం త్రిబుల్ ఆర్ సినిమాలోనే నటించారు. అది కూడా ఆస్కార్ లెవల్ లో రాణించడంతో జూనియర్ ఎన్టీఆర్ పై అంచనాలు పెరిగిపోయాయి. కాగా దేవర సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. కాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని నోవాటెల్ హోటల్ లో పెట్టగా ప్రేక్షకులు ఎక్కువగా రావడంతో ఆ ఈవెంట్ కాస్త రద్దయిపోయింది.