Bollywood disaster : 45 కోట్లు పెట్టితీస్తే రూ.45వేలు వచ్చిన బాలీవుడ్ డిజాస్టర్ సినిమా
Bollywood disaster : హిట్టవుతుందనే నమ్మకంతోనే దర్శకనిర్మాతలు, హీరోలు సినిమాలు చేస్తుంటారు. అయితే ఇందులో కొన్ని హిట్టవుతుంటాయి. మరికొన్ని సూపర్ డూపర్ హిట్లుగా నిలిచి ఇండస్ర్టీ రికార్డులను సైతం తిరగరాస్తుంటాయి. కొన్ని సినిమాలు ప్లాఫ్ గా మిగిలినా విమర్శకులను సైతం మెప్పిస్తుంటాయి. కొన్ని సినిమాలు రిలీజ్ టైమ్ బాగోలేకపోయినా సరైన థియేటర్లు దొరక్క కలెక్షన్లు రాబట్టలేకపోతుంటాయి. కొన్ని ప్లాఫ్ సినిమాలు ఓటీటీలో దుమ్ము రేపుతున్నాయి. ఇక ఇవన్నవీ ఒకెత్తయితే ఓ బాలీవుడ్ సినిమా ప్లాఫ్ మూవీస్ లలో కూడా సరికొత్త రికార్డు నెలకొల్పింది. అసలుఈ స్థాయి డిజాస్టర్ ఎవరూ ఊహించలేదు. అదీ ఓ స్టార్ హీరోహీరోయిన్లు నటించిన సినిమా డిజాస్టర్ దర్శకనిర్మాతలకే కాదు, ఏకంగా బాలీవుడ్ ఇండస్ర్టీకే షాక్ ఇచ్చింది..
భారతదేశంలో ఇప్పటిదాకా అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిన సినిమా ఆ స్టార్ హీరో సినిమా చరిత్రలో నిలిచింది. దేశ వ్యాప్తంగా ఈ సినిమాను మించిన డిజాస్టర్ మరోకటి లేదేంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ సినిమాని ఏకంగా రూ. 45 కోట్లు వెచ్చించి మరీ నిర్మించారు. ఇక ఈ సినిమా కలెక్షన్లు చూసి నిర్మాతకు గుండెపోటు వచ్చి ఉండాలి. ఇంతకీ ఈ సినిమా వసూలు చేసిందనుకుంటున్నారా కేవలం రూ. 45 వేలు మాత్రమే.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజులు జరిగినా పూర్తి చేయలేకపోయారు. బడ్జెట్ పెరిగిపోతూ ఉండడంతో షూటింగ్ కూడా మొత్తం పూర్త అవ్వకుండానే సినిమాని విడుదల చేశారు. దీంతో ఈ సినిమా డిజాస్టర్ లకే డిజాస్టర్ గా నిలిచి సరికొత్ రికార్డు సృష్టించింది. దేశ వ్యాప్తంగా ఈ సినిమాకి కేవలం 12 షోలు మాత్రమే పడ్డాయి. మొదటిరోజు 293 టికెట్లు అమ్ముడయ్యాయి. అక్కడే 38వేలు కలెక్ట్ చేసింది. ఇక ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి వచ్చింది కేవలం రూ. 45 వేలు మాత్రమే.
ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. కానీ ఓటీటీలో ఇంకా స్ర్టీమింగ్ చేయడం లేదు. హీరోహీరోయిన్లు అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్లు కూడా సినిమాను ప్రమోట్ చేయలేమని కుండబద్దలు కొట్టేశారు. అలా ఈ సినిమా మరుగున పడిపోయింది.