R. Krishnaiah : ఆర్ కృష్ణయ్యను కలిసిన ఆ పార్టీ ఎంపీ.. పార్టీలోకి రావాలని ఆహ్వానం..

R. Krishnaiah

R. Krishnaiah

R. Krishnaiah : బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ పదివికి రాజీనామా చేశాడు. ఆయన గతంలో వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లాడు. ఇటీవల ఆయన రాజీనామా చేశాడు. ఆయన రిజైన్ చేసిన  మరుసటి రోజే కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆర్ కృష్ణయ్యను కలిశారు. 2022లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కృష్ణయ్య తన రాజీనామా లేఖను ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ కు సమర్పించారు.

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కృష్ణయ్యను కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కుల గణన ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వెనుకబడిన తరగతుల నేత కృష్ణయ్య మంగళవారం చెప్పారు. వెనుకబడిన తరగతులకు రాజకీయ రిజర్వేషన్లు పెంచేందుకు కృషి చేస్తానన్నాను.

2022లో రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కృష్ణయ్య పదవీకాలం పూర్తి కావడానికి ఇంకా కొన్నేళ్ల సమయం ఉంది. జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీలో అఖండ మెజారిటీ ఉన్న వైసీపీ అనూహ్యంగా ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి వైసీపీ అధికారం కోల్పోయిన కొన్ని నెలలకే ఆయన రాజీనామా చేయడం గమనార్హం.

కృష్ణయ్య 2014లో టీడీపీలో చేరి 2014లో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు వైఎస్సార్ సీపీలో చేరారు.  ఈయన రాజీనామాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కృష్ణయ్య చేతులు కలిపారని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రతిపక్ష సభ్యులను కొనుగోలు చేయడం చంద్రబాబుకు తగదని ఆరోపిస్తున్నారు.

బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానన్న ఆశతోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృష్ణయ్యను నియమించారని వైఎస్సార్సీపీ గుర్తు చేసింది. చంద్రబాబుకు అండగా నిలవాలని కృష్ణయ్య తీసుకున్న నిర్ణయం ఆ సామాజికవర్గానికి, పార్టీ, ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి తీవ్ర ద్రోహం చేయడమేనని వైఎస్సార్ సీపీ పేర్కొంది. వైసీపీ నుంచి నెల రోజుల వ్యవధిలో రాజీనామా చేసిన మూడో రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య కావడం గమనార్హం.

ఆగస్ట్ 29న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 11 నుంచి 8కి పడిపోయింది.

TAGS