Rajini and Vijay : రజనీ, విజయ్‌ పారితోషికాలు తగ్గించుకోవాలి..!

Rajini and Vijay

Rajini and Vijay

Rajini and Vijay Remunerations : కొవిడ్ తర్వాత చిత్ర పరిశ్రమ భారీ కుదుపునకు లోనైంది. దీనికి తోడు ఇండస్ట్రీల్లో స్టార్ హీరోల రెమ్యునరేషన్ భారీగా పెరిగింది. ఇది సినిమా విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక ఆంగ్ల మ్యాగజైన్ నిర్వహించిన ‘డైరెక్టర్స్‌ అన్‌కట్‌’ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడారు. పా. రంజిత్‌, జోయా అక్తర్‌, కరణ్‌ జోహార్‌, మహేశ్‌ నారాయణ్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. నటులు తమ పార్కెట్ కు మించి రెమ్యునరేషన్ డిమాండ్‌ చేస్తున్నారని కరణ్‌ జోహార్‌ అభిప్రాయం వ్యక్తం చేయగా.. వెట్రిమారన్‌ మాట్లాడుతూ.. ఓటీటీ ప్లాట్ ఫారాలు సినిమాలను భారీ మొత్తానికి కొనుగోలు చేయగా ఇండస్ట్రీ సతమతానికి గురవుతుందన్నారు. రజనీకాంత్‌, విజయ్‌ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్‌ మూవీల విషయంలో ఓటీటీలు రూ. 120 కోట్లు అయినా చెల్లించేందుకు సిద్ధపడుతున్నాయన్నారు. దీంతో పారితోషికాలు పెంచేస్తున్నారని పేర్కొన్నారు.

‘ప్రస్తుత పరిస్థితిని థియేట్రికల్‌ బాక్సాఫీస్‌ డిజాస్టర్ అని అనలేం. ఇది ఓటీటీలు సృష్టించిన మాయాజాలం. కొవిడ్ లాంటి పరిస్థితిని అవి ఒడిసిపట్టుకున్నాయి. వాళ్లు వచ్చి ‘రజనీ కాంత్‌, విజయ్‌ నటించే సినిమాలకు రూ. 120 కోట్లు ఇస్తాం. మూవీ తీయండి’ అంటారు. దీంతో బడ్జెట్‌ పెరుగుతుంది. దీంతో పాటు హీరోల పారితోషికాలు కూడా పెరుగుతున్నాయి. ఈ పద్ధతి సరైనది కాదని ఓటీటీలు గ్రహించి వెనక్కు తగ్గాయి. దీంతో భారీ బడ్జెట్ పెట్టిన నిర్మాతలు హీరోలతో అగ్రిమెంట్ సైతం చేసుకున్నారు. ఈ సమయంలో ఓటీటీలు వెనక్కి తగ్గితే నిర్మాత ఏం చేయాలి?’ అని వెట్రిమారన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

దర్శకుడు మారి సెల్వరాజ్‌ స్మాల్ బడ్జెట్‌ మూవీస్ చేస్తూ డబుల్ లాభం  ఆర్జిస్తున్నారని వెట్రిమారన్‌ మెచ్చుకున్నారు. ‘మారి సెల్వరాజ్‌ డైరెక్షన్ లో వచ్చిన ‘వాఝై’ లాంటి మూవీకి మంచి లాభాలు వచ్చాయి. కంటెంట్ బాగుంటే థియేటర్ కు వచ్చి చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారు. ఈ విషయంలో మనం పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. థియేటర్‌లోనే మూవీ చూడాలని ప్రేక్షకులను ప్రోత్సహించాలి. థియేటర్‌ ఎఫెక్ట్స్ ను దృష్టిలో  ఉంచుకొనే సినిమా చేయాలి. సెన్సార్‌షిప్‌ విషయంలో ఓటీటీలు స్వీయ నియంత్రణ పాటించాలి. ఇదే ట్రెండ్‌ హాలీవుడ్‌లో వచ్చింది. ఇప్పుడు వాళ్లు వాటిని సరిచేసుకుంటున్నారు. సినిమా నాణ్యత విషయంలో రాజీలేకుండా దర్శకులు అనుకున్న బడ్జెట్‌ కన్నా ఎక్కువే ఇస్తున్నారు. అందుకే నెట్‌ ఫ్లిక్స్‌ లాంటి సంస్థలకు పారదర్శకమైన వ్యూవర్‌షిప్‌ ఉంటుంది. సరైన టాలెంట్ ను ఎలా రాబట్టుకోవాలో వారికి తెలుసు’ అని వెట్రిమారన్‌ అన్నారు.

స్టార్ల పారితోషికాల పెంపులో తప్పులను సరిదిద్దుతున్నట్లు కరణ్‌జోహార్‌ అన్నారు. అందుకు ఉదాహరణే ‘కిల్‌’ అన్నారు. ఆ మూవీకి బడ్జెట్‌ రూ. 40కోట్లు అంతే రెమ్యూనరేషన్‌ కావాలని కొందరు స్టార్లు అడగడంతో కొత్త నటులను పెట్టి తీసినట్లు వివరించారు. చర్చల సందర్భంగా ‘సినిమాకు రూ. 40 కోట్లు,  మీ పారితోషికం రూ. 40 కోట్లు. కలెక్షన్లు రూ. 120 కోట్లు వస్తాయని గ్యారెంటీ ఇస్తారా?’ అని అడిగా, వాళ్లు మాట్లాడలేదు. ఎందుకంటే అది అయ్యే పని కాదు’ అని కరణ్‌ చెప్పుకొచ్చారు.

TAGS