SV Ranga Rao : ఎస్వీ రంగారావు అంటే ఆ ఇద్దరు నటులకు మహా భయం..

SV Ranga Rao

SV Ranga Rao and NTR and ANR

SV Ranga Rao : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు అంటే తెలియని వారు ఉండరు. తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం వారిద్దరి గురించి చర్చించుకుంటునే ఉంటారు. తెలుగు చిత్ర రంగాన్ని వారిద్దరూ అంతలా ప్రభావితం చేశారు. సీనియర్ ఎన్టీఆర్ పౌరాణిక, జానపద చిత్రాలకు ప్రాణం పోస్తే, ఏఎన్నార్ క్లాసికల్ మూవీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు.

ఇలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వారు వేసి అడుగులు ప్రస్తుత తరాలకు, రాబోయే బావి తరాలకు కూడా ఉపయోగపడేలా చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ డేట్స్ కోసం సినీ నిర్మాతలు వెయిట్ చేసేవారు.  క్యూలు కట్టి మరీ డేట్స్ తీసుకునే వారు. దీనికి తోడు తెలుగు ప్రేక్షకులు కూడా వీరిని అక్కున చేర్చుకున్నారు. వారి ఇంటి మనిషిగా భావించేవారు. అలాంటి మహా నటులు కూడా మరో నటుడికి భయపడేవారని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు. టాలెంటెడ్ లెజెండరీ యాక్టర్ ఎస్వీ రంగావు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ కంటే సీనియర్ నటుడు అయిన ఎస్వీ రంగారావు డైలాగ్స్ చెప్పడంలో దిట్ట. ఆయన  తర్వాతే ఎవరైనా.  ప్రతి చిత్రంలో తన పాత్రకు ప్రాణం పోసి మిగతా నటులది ఎంత పెద్ద క్యారెక్టర్ అయినా.. వారెవరూ కనిపించకుండా చేయగల శక్తి సామర్థ్యాలు ఎస్వీ రంగారావు సొంతం. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఒక సారి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎస్వీ రంగారావు ను చూస్తేనే భయం వేసేది. ఆయనతో మాట్లాడటమంటే ఇక అంతే అని అన్నారు.

ఎస్వీ రంగారావును చూసి ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కూడా గజ గజ వణికిపోయేవారని చెప్పారు. అంతలా ప్రభావితం చేసిన ఎస్వీ రంగారావు చివరి దశలో అష్టకష్టాలు పడి చనిపోయారు. మద్యానికి బానిసై చనిపోయినట్లు చెబుతుంటారు. తెలుగు చిత్ర రంగంలో ఎస్వీ రంగారావు పాత్ర వెలకట్టలేనిది. మాయబజార్ చిత్రంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తో కలిసి ఎస్వీ రంగారావు నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కూడా కలిసి 15 చిత్రాల వరకు యాక్ట్ చేశారు.

TAGS