Shankar : దేవరపై శంకర్ కోపంగా ఉన్నాడా.. కొరటాల శివ ఆ తప్పు చేశాడా..?

Shankar

Shankar

Director Shankar angry on Devara : దేవర: పార్ట్ 1 సంచనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. దీనికి ఈ మూవీకి సంబంధించి ప్రతీ ఒక్క అంశం సోషల్ మీడియాతో పాటు మేయిన్ స్ట్రీమ్ మీడియాను ఆకర్షిస్తుంది. మొన్నటికి మొన్న 2000 కెపాసిటీ సీటింగ్ ఉన్న ఒక హోటల్ లో ప్రీ ప్రమోషన్ నిర్వహించగా.. దాదాపు 25000 మంది వచ్చారు. స్థలం లేక హోటల్ ను ధ్వంసం చేశారు.

ఈ సినిమాలోని వివాదాలు దర్శకులను సైతం ఆకర్షిస్తున్నాయి. తాను హక్కులు కొనుగోలు చేసిన ఓ తమిళ నవలలోని సన్నివేశాలను కొందరు దర్శక నిర్మాతలు వాడుకోవడంపై దర్శకుడు శంకర్ ఎక్స్ లో అసహనం వ్యక్తం చేశారు. తాను ‘నవయుగ నాయగన్ వేల్ పారి’ నవల హక్కులను పొందానని, పుస్తకంలోని కీలక సన్నివేశాలను కొందరు డైరెక్టర్లు అనధికారికంగా ఉపయోగించడం తనను కలచివేసిందని శంకర్ పేర్కొన్నారు.

తాజాగా ఓ కొత్త సినిమా ట్రైలర్ లో ఈ నవలలోని ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని గమనించానని ఆయన పేర్కొన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వెట్టైయన్’, ‘ఎన్టీఆర్ దేవర’ వంటి భారీ చిత్రాల ట్రైలర్లు విడుదలయ్యాయి. శంకర్ ప్రస్తావించిన కంటెంట్ ను బట్టి దర్శకుడు కొరటాల శివ తను కొనుగోలు చేసిన నవలలోని సన్నివేశాలను దేవర కోసం వాడుకోవడంపై ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

‘’చాలా సినిమాల్లో అనుమతి లేకుండా కీలక సన్నివేశాలను తొలగించి ఉపయోగించడం నన్ను కలచివేసింది. రీసెంట్ మూవీ ట్రైలర్ లో నవలలోని ఓ ముఖ్యమైన కీలక సన్నివేశాన్ని చూసి చాలా బాధపడ్డానని పేర్కొన్నారు.

TAGS