Devara : సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే ‘దేవర’.. మరి మిడ్ నైట్ షోల పరిస్థితి ఏంటి?

Devara

Devara

Devara : మరికొన్ని రోజుల్లో ‘దేవర: పార్ట్ 1’ రిలీజ్ నేపథ్యంలో ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ప్రమోషన్ ఈవెంట్ లో సీటింగ్ కెపాసిటీ సరిపోక కొంచెం గందరగోళం ఏర్పడింది. ఇంకా ఈ సినిమాకు నైజాం ఏరియాకు స్పెషల్ షో టైమింగ్స్ ఇంకా ఖరారు చేయలేదు మేకర్స్. రూ.1000 టికెట్ ధరతో అర్ధరాత్రి నుంచే షోలు ప్రారంభమవుతాయని విస్తృతంగా వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.

తొలిసారిగా ఈ స్పెషల్ షోల టికెట్లను రూ. 1000కు విక్రయించేందుకు డిస్ట్రిబ్యూటర్ ప్రభుత్వ అనుమతి కోరుతున్నారు. ఇందుకు జీవో (గవర్నమెంట్ ఆర్డర్) జారీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది. ప్రభుత్వం జీవో జారీ చేస్తే మల్టీప్లెక్స్ లు ప్రామాణిక పద్ధతి ప్రకారం.. టికెట్ ధరలో సగం తీసుకుంటాయి. ఈ సెటప్ డిస్ట్రిబ్యూటర్ కంటే మల్టీప్లెక్స్ కు ఎక్కువ ప్రయోజనం చేకూరేలా కనిపిస్తుంది.

అందువల్ల స్పెషల్ షోలను సింగిల్ స్క్రీన్ థియేటర్లకే పరిమితం చేస్తే డిస్ట్రిబ్యూటర్ కు ఎక్కువ లాభం వస్తుందనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే మిడ్ నైట్ షోలకు పోలీస్ శాఖ నుంచి ఇంకా అనుమతి అందలేదు. దానికి బదులుగా ఉదయం 4 షోలు వేయమని కొందరు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నిర్మాతలను కోరినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మిడ్ నైట్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూస్ వస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ దెబ్బతింటుందనే ఆందోళన మేకర్స్ లో వ్యక్తం అవుతోంది.

TAGS