Janhvi Kapoor : సారీలో మరింత ఆకర్షణీయంగా జాన్వీ కపూర్ ఎలా ఉందంటే?

Janhvi Kapoor

Janhvi Kapoor

Janhvi Kapoor in Saree : అందాల తార శ్రీదేవి నట వారసత్వాన్ని స్వీకరించింది ఆమె కూతురు జాన్వీ కపూర్. బాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకన్న ఆమె యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’తో టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. ఈ సినిమాలో ఆమె ఆంధ్రప్రదేశ్ లోని అందమైన తీర ప్రాంత కుగ్రామంలో నివసించే పాత్రలో కనిపించబోతోంది. ఫ్యాషన్ ఐకాన్ గా గుర్తింపు సంపాదించుకున్న జాన్వీ కపూర్ ఈ పాత్రకు ఏం న్యాయం చేస్తుందో చూడాలి.

Janhvi Kapoor
ఇక, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వీ కపూర్ తన పిక్ లను ఎప్పటి కప్పుడు అప్ లోడ్ చేస్తూ ఫ్యాన్స్ ను పలకరిస్తూ ఉంటుంది. గ్లైడెడ్ గోల్డ్ మెటాలిక్ సీక్విన్ పింక్ చీరలో దిగిన ఫొటోలు ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ ను బాగా అలరిస్తున్నాయి. ఈ సారీలో ఆమె ఆమె తల్లి శ్రీదేవిని గుర్తు చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Janhvi Kapoor
మెరిసే ఫాబ్రిక్ తీర ప్రాంత నేపథ్యానికి అనుగుణంగా ఉంటుంది. ఇంకా ఆ గ్రామ పరిసరాలల్లో కలిసిపోతుంది. మృదువైన మట్టి టోన్లు ఆమె కళ్లను అలంకరించాయి. ప్రకాశవంతమైన మెరుపును అందిస్తుంది. ఈ పిక్ లను చాలా మంది ఫ్యాన్స్ మొబైల్ స్క్రీన్ సేవర్ గా పెట్టుకున్నారంటే సందేహం లేదు. అతిలోక సుందరిగా, అందాల తారగా శ్రీదేవి బాలీవుడ్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది.

TAGS