Green card : అమెరికా గ్రీన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. వ్యాలిడిటీ పెంపు

Green card

USA Green card

US green card : గ్రీన్ కార్డు దారులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. గ్రీన్ కార్డు రెన్యూవల్ కోసం ఉన్న గడువును 36 నెలలకు పెంచుతూ అమెరికా ఓ నిర్ణయం తీసుకుంది. రెన్యూవల్ గడువును 36 నెలలకు పెంచినట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ వెల్లడించింది. దీంతో గ్రీన్ కార్డు రెన్యూవల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఊరట లభించినట్లయింది.

సాధారణంగా అమెరికాలో గ్రీన్ కార్డులు పొందినవారు ప్రతీ పదేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలి. అందుకోసం కార్డు తీరిపోయే కాలానికి ఆరు నెలల ముందే ఐ-90 ఫామ్ ను సమర్పించాలి. రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి కార్డు వ్యాలిడిటీని 24 నెలలే పొడిగిస్తూ రిసీట్ నోటీసు ఇస్తారు. దీంతో గ్రీన్ కార్డు గడువు తీరిపోయినా.. ఈ నోటీసుతో వారికి చట్టబద్ధమైన నివాస హోదా కొనసాగుతుంది. కొత్త కార్డు జారీ అయ్యే వరకు ఉద్యోగాలు, ప్రయాణాల సమయంలో వారు దాన్ని లీగల్ స్టేటస్ ప్రూఫ్ గా వినియోగించుకోవచ్చు. తాజాగా ఈ గ్రీన్ కార్డు అదనపు వ్యాలిడిటీని 36 నెలలకు పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది.

TAGS