Jamili Elections : జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం : ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
Jamili elections : జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్ వేదికగా స్పందించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ రూపొందించిన నివేదించిన నివేదికను మంత్రి వర్గం ఆమోదించిన నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధానం ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని ఆరోపించారు.
రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని ఇది రాజీ చేస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ, అమిత్ షాకు తప్ప, ఎవరికీ బహుళ ఎన్నికలు సమస్య కాదని తెలిపారు. ఈ అంశంపై మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. జమిలి ఎన్నికలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం నేపథ్యంలో మనకు ఏకకాల ఎన్నికలే అవసరం కాదని తేల్చి చెప్పారు. తరచుగా ఆవర్తన ఎన్నికలు ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తాయని ఓవైసీ పేర్కొన్నారు.