Star hero : ఆ హీరోయిన్ తో ప్రేమాయణం. స్టార్ హీరో కెరీర్ క్లోజ్

Star hero

Star heros

Star hero : సినీ పరిశ్రమలో  హీరోహీరోయిన్లు, లేదా ఇతర విభాగాల వారీగా లవ్ ఎఫైర్లు సాధారణమే. అయితే ఒక హీరోయిన్ లవ్ లో పడితే మాత్రం ఆమె కెరీర్ ముగిసిన సంఘటనలు చూశాం. ఓ హీరోతో లవ్ ఎపైర్ కారణంగా స్టార్ హీరోయిన్ ఆర్తి ఆగర్వాల్ డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ కొన్నేళ్ల క్రితం రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే.  ఆ హీరో తల్లి  ఆర్తి అగర్వాల్ కు వార్నింగ్ ఇవ్వడంతో డిప్రెషన్ లో వెళ్లిందనే అప్పట్లో చాలానే రూమర్లు వినిపించాయి. మరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు కూడా అప్పటికే పెళ్లయిన హీరోలతో ప్రేమాయణం సాగించి తమ కెరీర్ ను నాశనం చేసుకున్నారని ఇండస్ర్టీలో టాక్ నడుస్తుంటుంది.

కానీ ఓ స్టార్ హీరోయిన్ తో పీకల్లోతూ ప్రేమలో పడి  ఓ బాలీవుడ్ స్టార్ హీరో తన కెరీర్ ను నిండా ముంచేసుకున్నాడు.  బాలీవుడ్ నటుడు సురేష్ ఒబెరాయ్ తనయుడు వివేక్ ఒబెరాయ్ హీరోగా  బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. వివేక్ ఒబెరాయ్ ఆర్జీవీ ‘కంపెనీ’తో సినిమాల్లోకి  ఎంటరరయ్యాడు. అతి తక్కువ సమయంలోనే ఖాన్ లకు  ధీటుగా స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు. అప్పటికే హీరోయిన్ గా టాప్ రేంజ్ లో ఉన్న ఐశ్వర్యరాయ్‌ పై మనసు పారేసుకున్నాడు. వీరిద్దరూ చాలాకాలం డేటింగ్ కూడా  చేశారని అప్పట్లో రూమర్లు వచ్చాయి. పార్టీల్లో , పబ్‌ల్లో  కనిపించి బాలీవుడ్ మీడియా కంటపడ్డారు. అప్పటికే కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా  ఐశ్వర్యరాయ్‌ ను పిచ్చిపిచ్చిగా ప్రేమించేశాడు. ఐశ్వర్య కొంత కాలం సల్లాభాయ్ తో క్లోజ్‌గా ఉన్నా అతని షార్ట్ టెంపర్ ను తట్టుకోలేక దూరం పెడుతూ వచ్చింది. అదే సమయంలో వివేక్ ఓబెరాయ్ దగ్గరయ్యాడు. దీనిని తట్టుకోలేని సల్మాన్ వివేక్ ఓబెరాయ్ పై బహిరంగంగానే వాదనకు దిగాడు. ఓ పార్టీలో సల్మాన్ వివేక్ పై దాడి కూడా చేశాడని ఇప్పటికీ రూమర్లు వినిపిస్తుంటాయి. ఐశ్వర్యకు దూరంగా ఉండకుంటే చంపేస్తానంటూ సల్మాన్ వివేక్ ఓబెరాయ్ ను  బెదిరించాడనే గుసగుసలు కూడా వినిపించాయి.

ఆ తర్వాత హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ కు జైలుకు వెళ్లాడు. అదే సమయంలో వివేక్ ఓబెరాయ్ సినిమాలు ప్లాఫ్ కావడంతో కెరీర్ కూడా క్లోజ్ అయ్యింది. ఆ తర్వాత ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ తో రిలేషన్ షిప్ కొనసాగించి పెళ్లి కూడా చేసుకుంది. అలా ఐశ్వర్య వెంట పడి  తెలియకుండానే వివేక్ తన కెరీర్ క్లోజ్ చేసుకున్నాడని బాలీవుడ్ లో ఇప్పటికీ రూమర్లు వినిపిస్తుంటాయి.

TAGS