BJP : బీజేపీ రెచ్చిపోవడానికి కారణమేంటో తెలుసా?

BJP

BJP

BJP : తెలంగాణలో రాజకీయ ఎత్తుగడలు మారుతున్నాయి. ఇన్నాళ్లు బీజేపీ, బీఆర్ఎస్ అనే ఉద్దేశం చాలా మందిలో ఉండేది. కానీ ఇప్పుడు అవి రెండు వేర్వేరు పార్టీలనే తేలిపోయింది. మొదట పెద్దగా విమర్శలు చేసుకోకుండానే ప్రచారంలో దూసుకుపోయాయి. ప్రస్తుతం రెండు పరస్పరం విద్వేషపూరితంగా విమర్శలు చేసుకుంటున్నాయి. లిక్కర్ స్కాంలో కవిత పాత్ర కనిపించినా ఆమె అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు బీజం వేసింది. తరువాత రెండు పార్టీల్లో ఏం జరిగిందో ఏమో కానీ విమర్శలు తారాస్థాయికి చేరాయి.

తెలంగాణలో ప్రభావం చూపించాలని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్ర ఏక్ నాథ్ షిండే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం బిశ్వకర్మ తదితరులు రాష్ట్రంలో పర్యటిస్తూ బీజేపీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. అందుకనుగుణంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ముప్పై ఏళ్లుగా పరిష్కారం కాని ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. మందక్రిష్ణ మాదిగతో పొత్తు పెట్టుకుని రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి మాదిగల ఓట్లు తమ వైపు తిప్పుకున్నారు. దీంతో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఎస్సీల్లో బలమైన సామాజికవర్గం మాదిగలు. మందక్రిష్ణ బీజేపీకి ఓటు వేయాలని చెప్పడంతో ఇక బీజేపీ రాష్ట్రంలో కనీసం ఇరవై స్థానాల్లో అయినా గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పాలని భావిస్తోంది.

ఓ టీవీ చానల్ నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రచారం చేశారు. తెలుగువారి మనసులు గెలుచుకుని ఇక్కడ బీజేపీ బలమైన శక్తిగా ఆవిర్భవించాలని మొదటి నుంచి మోదీ కలలు కంటున్నారు. ఇందులో భాగంగానే ఇక్కడ బలమైన రాజకీయ శక్తిగా నిలవాలని చూస్తున్నారు. దీని కోసమే నిరంతరం పర్యటనలు చేస్తూ ఓట్లు రాబట్టుకోవాలని ప్లాన్ వేసుకున్నారు.

TAGS