Nagamanikantha : నాగమణికంఠ భార్య ఫొటోలు చూసి షాకవుతున్న నెటిజన్లు
Bigg Nagamanikantha wife : సెప్టెంబర్1న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆకట్టుకుంటున్నది. ఈ సారి కంటెస్టెంట్లు చాలా వరకు కొత్త వాళ్లు అయినా.. ఎపిసోడ్లు మాత్రం చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. కంటెస్టంట్లలో నాగమణికంఠ సానుభూతితో బాగా వైరల్ అయ్యాడు. బిగ్ బాస్ పరంగా సోషల్ మీడియాలో కూడా అతడే ట్రెండింగ్‌లో ఉన్నాడు..
అప్పుడే మొదటి వారం ముగిసింది. ఈ వారంలో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. వారిలో.. విష్ణుప్రియ, సోనియా, పృథ్వీరాజ్, శేఖర్ బాషా, బేబక్క, నాగమణికంఠ కూడా ఉన్నారు. దీంతో.. వీరిలోంచి ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతారా అనే చర్చ జోరందుకున్నది. వీరిలో నాగ మణికంఠ, విష్ణుప్రియకు ఓట్లు బాగా పోల్ అవుతున్నాయనే టాక్ వినిపిస్తున్నది. కొన్ని పోల్స్‌లో విష్ణుప్రియ.. మరికొన్ని పోల్స్‌లో నాగమణికంఠ పోటాపోటీగా దూసుకుపోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ ఎలిమేనేషన్ నుంచి బయట పడతారనే టాక్ మరింత బలంగా వినిపిస్తున్నది.
ప్రస్తుతం నాగమణికంఠకు సంబంధించిన పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు, వీడియోలో నాగమణికంఠ భార్యను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎలాంటి అంచనాల్లేకుండా బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన మణికంఠ.. తన పరిచయ వీడియోలో చెప్పుకున్న కష్టాలతో ఆడియన్స్ నుంచి సింపతి కొట్టేశాడు. తనకు తల్లిదండ్రులు లేరని, భార్య కూడా వదిలేసిందంటూ చెప్పుకొని సానుభూతి పాయింట్లు బాగానే కొట్టేశాడు.
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో మణికంఠ వెడ్డింగ్ వీడియో రిలీజ్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈ వీడియో చూసిన యూజర్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే కొందరు నాగమణికంఠ ఆయన భార్యను చూసి వ్యగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం అలాంటి కామెంట్లు పెట్టొద్దంటూ పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి మణికంఠ పెళ్లి వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.