Bigg Boss : కన్నీళ్లు పెట్టుకున్న యూట్యూబ్ స్టార్ మొదటి వారమే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం మొదటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయింది. బెజవాడ బేబక్క గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన బేబక్క మొదటి వారంలో నే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. విష్ణు ప్రియ, నిఖిల్, నాగ మణికంఠ, పృథ్వీ, శేఖర్ భాషా, సోనియా తో పాటు బేబక్క నామినేషన్ లో ఉండేది. చివరగా నాగ మణికంఠ, బేబక్క ఇద్దరు చివరి వరకు ఉండగా బేబక్క కు తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ అయిపోయింది.
బిగ్ బాస్ సీజన్ లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. కాగా ఇందులో ఒకరు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం 13 మంది ఉన్నారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున గేమ్స్ ఆడించి చివరకు ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చారు. చివరకు బేబక్క ను ఎలిమినేట్ చేశారు. కాగా బేబక్క మాత్రం తాను ఈ ఎలిమినేషన్ ను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పింది. శనివారం కేవలం సోనియాను సేవ్ చేయగా.. ఆదివారం శేఖర్ భాషాతో పాటు పృథ్వీ, విష్ణు ప్రియ ఇలా ఒక్కొక్కరిని సేవ్ చేశారు
అయితే అందరూ నాగ మణికంఠ వెళ్లిపోతాడని భావించారు. కానీ బేబక్క ఎలిమినేట్ అయ్యే సరికి తట్టుకోలేకపోయార ఆమె ఫ్యాన్స్. చివరగా మణికంఠ హౌస్ లోకి వెళ్లే సరికి అభయ్, ఓం ఆదిత్య దగ్గరకు తీసుకుని నువ్వే వస్తావని అంచనా వేశామని ప్లేటు పిరాయించారు. నిన్ను జనం సేవ్ చేస్తారని నాకు ముందే తెలుసు అంటూ అభయ్ అన్నాడు.
కాగా హౌస్ నుంచి వెళ్లిపోతున్న బేబక్క కు నాగార్జున చివరి చాన్స్ ఇచ్చారు. హౌస్ లో అర్హత లేని వాళ్లను రోడ్డున పడేసే చాన్స్ నీకు ఇస్తున్నాను అని చెప్పగా.. సోనియా, పృథ్వీ, నిఖిల్ లను రోడ్డున పడేసింది. ఇలా ఒక్కొక్కరిని మీద కసి తీర్చుకుంది. కానీ బయటకు వచ్చాక కన్నీళ్లు పెట్టుకుంది.