Secret camera : గర్ల్స్ హాస్టల్ వాష్ రూంలలో సీక్రెట్ కెమెరా.. వైసిపి నేత కుమారుడికి దేహశుద్ధి
Secret camera in Girls Hostel : ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహిళల్లో అభద్రతా భావం నెలకొంది. ఎన్ని కఠిన చట్టాలు అమలులో ఉన్నా.. కొందరు కామాంధుల పనికి యావత్ సమాజం తలవంచాల్సి వస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్ బాత్ రూంలో 29వ తేదీ సాయంత్రం సీక్రెట్ కెమెరా కంటబడింది. ఈ ఘటనతో ఆ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న బాలికలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. లేడీస్ హాస్టల్లోని బాత్రూమ్లో దాదాపు 300 మంది అమ్మాయిలకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర వీడియోలను అమ్మాయిలకు తెలియకుండా కొందరు పోకిరీలు దాచిపెట్టారు. అంతేకాదు సమీపంలోని బాలుర హాస్టల్ నుంచి కొందరు ఈ కెమెరాలను కొనుగోలు చేసి ఈ అకృత్యాలకు పాల్పడినట్లు వెల్లడైంది.
రహస్య కెమెరాలకు సంబంధించిన ఘటనలో బాలుర హాస్టల్‌కు చెందిన కొందరు వైసీపీ నేత కుమారుడి సహకారంతో ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీడియోలు విక్రయిస్తున్నాడంటూ అతడిపై సహచర విద్యార్థులు దాడికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ హాస్టల్ కు చేరుకున్నారు. ఆ సమయంలో విద్యార్థులను పోలీసులు అదుపుచేశారు. ఆ తరువాత ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ ని ప్రశ్నించారు. అతని వద్ద నుంచి ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంజినీరింగ్ కళాశాలలో బాలికలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాదు కాలేజీ క్యాంపస్ మొత్తం దద్దరిల్లేలా పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభించారు. ఈ విషయం బయటకు రాకుండా కాలేజీ యాజమాన్యం తమ వంతు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
దీంతో కళాశాల విద్యార్థులు వాష్‌రూమ్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అంతేకాదు, ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులందరినీ బహిరంగంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే వెన్నులో వణుకు పుట్టించేలా ప్రభుత్వం వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దారుణ ఘటనకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.