Ashwathama : కల్కిలో ఆశ్వత్థామగా నటించింది అమితాబ్ కాదా?

Ashwathama

Ashwathama

Ashwathama : శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్ జంటగా నటించిన ‘స్త్రీ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. రోజురోజుకు ఈ సినిమా భారీ వసూళ్లతో  దూసుకుపోతోంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఈసారి ‘స్త్రీ’కి బదులు ‘సర్కటే కే టెర్రర్’ చూపించి జనాలను ఎంతగానో అలరించారు. విడుదలైన మొదటి రోజు నుంచి స్ట్రీ 2 సినిమాకి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా తర్వాత శ్రద్ధా కపూర్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. వీటన్నింటికన్నా ప్రేక్షకుల దృష్టి సునీల్ కుమార్ అనే ‘సర్కటే’పై పడింది.

సునీల్ కుమార్ ఎవరు?..

స్త్రీ 2 సినిమా తర్వాత సునీల్ కుమార్ వెలుగులోకి వచ్చాడు. అయితే ఇది అతనికి మొదటి సినిమా కాదు. సునీల్ ఇంతకు ముందు కొన్ని ప్రాజెక్ట్‌లలో కూడా భాగమయ్యాడు, వాటిలో ఒకటి ఇటీవల విడుదలైన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కల్కి 2898 AD’.

‘ది గ్రేట్ ఖలీ’గా ప్రసిద్ధి.
జమ్మూ నివాసి సునీల్ కుమార్ ‘ది గ్రేట్ ఖలీ’గా ప్రసిద్ధి పొందాడు. పోలీస్‌లో కానిస్టేబుల్‌గా నియమితులయ్యారు. షూట్ కోసం అప్పుడప్పుడు సెలవు కోసం దరఖాస్తు చేసుకుంటూ ఉంటాడు. సునీల్ కు రెజ్లింగ్ అంటే కూడా ఇష్టం.
స్త్రీ 2 చిత్రంలో, సర్కాటే ముఖం సీజీఐతో క్రియేట్ చేశారు.  అయితే మేకర్స్ బాడీ షాట్ల కోసం సునీల్ కుమార్ అవసరం పడింది. సునీల్ ఢిల్లీలోని ఒక రెజ్లింగ్ కంపెనీలో ప్లేయర్. ఇక్కడి నుంచే కాస్టింగ్‌ డైరెక్టర్లు సునీల్ కుమార్ ను సంప్రదించారు.

కల్కిలో చేసిన ‘అశ్వత్థామ’..

సునీల్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 AD’లో పనిచేశాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ‘స్త్రీ 2’ కోసం ఆయనను సంప్రదించారు. కల్కి చిత్రంలో తాను అమితాబ్ బచ్చన్ బాడీ డబుల్‌గా చేశానని సునీల్ చెప్పాడు.
ఏ సీన్‌లో నటించారు అని సునీల్‌ని ప్రశ్నించగా.. బిగ్‌బి అమితాబ్‌ సర్‌ బాడీ డబుల్‌గా నటించిచనట్లు వెల్లడించారు. అమితాబ్ బచ్చన్‌తో సుమారు ఒకటిన్నర నెలలు, ప్రభాస్‌తో నెల పాటు షూటింగ్ చేశానని సునీల్ చెప్పాడు.  అమితాబ్ ఎప్పుడూ తననూ ముజ్ సే లంబా హే అంటూ సరదాగా ఆటపట్టించేవారని షూటింగ్ సంగతులను గుర్తు చేసుకున్నారు.

TAGS