Passengers : బస్సులో నుంచి ప్రయాణికులను దింపి కాల్పులు.. 23 మంది మృతి

Passengers

Passengers

Passengers Killed : పాకిస్తాన్ లో ఉగ్రవాదులు బస్సును ఆపి ప్రయాణికులను కిందకు దింపి కాల్పులు జరిపారు. ఈ దారుణ సంఘటన బెలూచిస్తాన్ లోని ముసాఖేల్ జిల్లాలో జరిగింది. ముసాఖేల్ లోని అంతర్ ప్రాంతీయ రహదారిలో బస్సును అడ్డగించిన ముష్కరులు.. అందులోని ప్రయాణికులను కిందకు దింపి వారిని తనిఖీ చేసిన తర్వాత కాల్పులకు పాల్పడ్డారని, ఈ ఘటనలో 23 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతులందరూ పంజాబ్ కు చెందినవారిగా గుర్తించినట్లు తెలిపారు.

గతంలోనూ పంజాబ్ కు చెందినవారిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డారు. ఏప్రిల్ లో ఉగ్రవాదులు నోష్కి సమీపంలో బస్సు నుండి తొమ్మిది మంది ప్రయాణికులను దించి, వారి ఐడీలను చెక్ చేసిన తర్వాత కాల్చి చంపారు. మళ్లీ దాదాపు నాలుగు నెలల తర్వాత ముసాఖేల్ లో అలాంటి దాడి జరిగింది. గత ఏడాది అక్టోబర్ లోనూ బెలూచిస్తాన్ లోని కెచ్ జిల్లాలో ఉన్న టర్బాత్ లో పంజాబ్ కు చెందిన ఆరుగురు కార్మికులను గుర్తు తెలియని సాయుధులు కాల్చి చంపారు. బాధితులందరూ దక్షిణ పంజాబ్ లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు వారి జాతి నేపథ్యం ఆధారంగా ఉగ్రవాదులు ఈ హత్యలు చేస్తున్నట్లు చెప్పారు.

TAGS