Ukraine : రష్యాపై 9/11 లాంటి దాడి.. ఈ సారి డ్రోన్ వినియోగం.. ఉక్రెయిన్ చేసిందా..?
Ukraine : ఉక్రెయిన్-రాష్యా యుద్ధం కొనసాగుతున్న తరుణంలో రష్యాలోని సరాటోవ్ ప్రాంతంలోని భారీ భవనంపై డ్రోన్ దాడి సంచలనంగా మారింది. ఈ దాడిలో ఎవరూ మృతి చెందలేదని రష్యా ప్రకటించింది. కానీ ఒక మహిళ గాయపడగా.. నివాసాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది. ఆ తర్వాత రష్యా వైమానిక దళం దాడిలో డ్రోన్ ధ్వంసమైంది. దీనికి సంబంధించి దృష్యాలను గవర్నర్ రోమన్ బసుర్గిన్ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ ద్వారా వివరించారు.
సరతోవ్ ఎత్తైన ప్రదేశం
టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో ఒక విమానం నుంచి బయటకు వచ్చిన డ్రోన్ సరతోవ్ లోని ఎత్తయిన బిల్డింగ్ పై అంతస్తులపై బలంగా దాడి చేసింది. దాదాపు మూడు అంతస్తుల మేర నివాసాలు దెబ్బతిన్నాయి. రోడ్డుపై శిథిలాలు చల్లాచెదురుగా పడి ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫారం ఎక్స్ లో ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ దాడిలో ఒక మహిళ తీవ్రంగా గాయపడిందని, ఆమె చావు బతుకుల మధ్య పోరాడుతుందని డాక్టర్ చెప్పారు.
గవర్నర్ బసుర్గిన్ మాట్లాడుతూ రాజధానికి ఆగ్నేయ వైపున వందల కిలో మీటర్ల దూరంలో ముఖ్య నగరమైన సరాటోవ్, ఎంగెల్స్లోని ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సేవలు అందించబడ్డాయి. రష్యా ఎంగెల్స్లో వ్యూహాత్మక బాంబర్ సైనిక స్థావరం కలిగి ఉంది. ఫిబ్రవరి, 2022లో మాస్కో తన పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్ అనేకసార్లు దాడి చేసింది. యుద్ధంలో పౌరులను లక్ష్యంగా చేసుకోవడం రెండు సంవత్సరాల తర్వాత కూడా కొనసాగుతోందని ఇరుపక్షాలు ఖండించాయి.
రష్యా ఉత్తర, తూర్పు మరియు దక్షిణ ఉక్రెయిన్పై దాడులు ప్రారంభించిందని, కనీసం నలుగురు వ్యక్తులు మరణించారని 37 మంది గాయపడ్డారని ఉక్రేయినియన్ మిలిటరీ, స్థానిక అధికారులు ఆదివారం చెప్పడంతో ఈ దాడులు జరిగాయి.
రాత్రి ఉక్రెయిన్ ముందు వరుస ప్రాంతాలైన చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, డొనెట్స్క్ లను లక్ష్యంగా చేసుకున్నాయని ఉక్రెయిన్ వైమానిక దళం టెలిగ్రామ్లో తెలిపింది. రష్యా ఉక్రేనియన్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. ఈ నెల ప్రారంభంలో రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోకి చొరబాటు మాస్కో అటువంటి దాడులకు ఆటంకం కలిగించే లక్ష్యంతో ఉందని కైవ్ చెప్పారు.
9/11 తరహాలో రష్యాలోని భారీ భవంతిపై అటాక్
రష్యా – సరాటోవ్లో ఉన్న భారీ భవంతిపై డ్రోన్ దాడి జరిగింది.. ఇది ఉక్రెయిన్ మిలిటరీ పనే అని అనుమానిస్తున్న రష్యా ఏజెన్సీస్. pic.twitter.com/dvliiz2MG5
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2024