Sisters Movies : అక్కాచెల్లెళ్ల సెంటిమెంట్ ప్రధానంగా టాప్ హీరోల మూవీలు ఇవే

Sisters Movies

Upcoming Sisters Movies of Top Heros

Sisters Movies : స్టార్ హీరోలు కమర్షియల్ మూవీలు చేస్తూ సాగిపోతుంటారని అందరూ అనుకుంటారు. కానీ కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాలు, బంధాలు అనుబంధాలు, తోబుట్టుల ప్రేమ అప్యాయతల కలబోతతో తీసిన మూవీలు విజయం సాధించిన సందర్భాలు కోకొల్లలు. రాఖీ పండగ సందర్భంగా కొంతమంది స్టార్ హీరోలు త్వరలో తీయబోతున్న కొన్ని సినిమాల్లో అక్కా చెల్లెళ్ల సెంటిమెంట్ ను బేస్ చేసుకుని ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

చిరంజీవి నెక్ట్స్ మూవీ విశ్వంభర షూటింగ్ జరుగుతోంది. ఇందులో యూవీ క్రియేషన్స్ లో వశిష్ఠ దీన్ని తెరకెక్కిస్తున్నారు. సోషల్ ఫాంటసీ చిత్రంగా నిలవనుంది. ఇందులో చిరంజీవి అయిదుగురు చెల్లెళ్లకు అన్నగా కనిపించనున్నట్లు ఫిల్మ్ వర్గాల టాక్. గతంలో హిట్లర్ సినిమాలో అయిదుగురు అక్కా చెల్లెళ్లతో తీసిన సినిమా తెలుగు సినీ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. విశ్వంభర ముగింపు దశలో ఉండగా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది.

నాని చిత్రం సరిపోదా శనివారం ఈ నెల 29న రిలీజ్ కానుంది. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో అరువి ఫేమ్ అదితి బాలన్ నానికి చెల్లెలిగా కనిపించనుంది. సినిమాకు ప్రాణం అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ అని అనుకుంటున్నారు.

స్టార్ హీరో నితిన్ తో తమ్ముడు అనే చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ కు అక్కగా లైలా నటిస్తున్నట్లు సమాచారం. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సమస్యల్లో చిక్కుకున్న తన సోదరిని కాపాడటానికి నితిన్ చేసే ప్రయత్నాలు ఇందులో ఆకట్టుకోనున్నాయని తెలుస్తోంది.

కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో విజయశాంతి వైజయంతిగా నటిస్తోంది. ఈ మూవీలో విజయశాంతికి తమ్ముడిగా కల్యాణ్ రామ్ నటిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. కాగా ఈ మూవీకి మెరుపు అని పెట్టనున్నారని టాక్. అతి త్వరలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

TAGS