Ravi Teja and Ram : రవితేజ, రామ్ లు విక్రమ్ హీరోను చూసి నేర్చుకోండి
Ravi Teja and Ram : మాస్ మహారాజ రవితేజ, ఎనర్జిటిక్ హీరో రామ్ ల సినిమాలు ఈ వీకెండ్ లో రిలీజ్ అయ్యాయి. రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్, రామ్ మూవీ డబుల్ ఇస్మార్ట్ లు థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. కాగా.. సినిమా లో హీరోగా నటించడమే కాకుండా పబ్లిసిటీ చేయడంలో ముందుండాల్సిన హీరోలు వెనకబడుతున్నారు.
తాజాగా రవితేజ కేవలం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే వచ్చాడు. కాగా హరీశ్ శంకర్ తో ఒకే ఒక్క ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రామ్ అయితే ఒక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తప్ప కనీసం మూవీ ప్రమోషన్లలో భాగంగా ఎక్కడ పాల్గొన్నట్లు కనిపించలేదు.
దీంతో ఎంత కష్టపడి సినిమా చేసినా కూడా సరైన ప్రమోషన్లు చేయకపోవడంతో ఆ మూవీలు ప్రేక్షకుల వద్దకు రీచ్ కాలేకపోతున్నాయి. కానీ ఇదే తెలుగు ఇండస్ట్రీలో తీసిన చాలా పాన్ ఇండియా మూవీలు కేవలం ప్రమోషన్ల కారణంగా ఇండియా లెవల్లో హిట్ అయ్యాయి. బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ లాంటి మూవీలకు ప్రభాస్ తో పాటు డైరెక్టర్, హీరోయిన్లు అందరూ కష్టపడి ఈవెంట్లు, ప్రమోషన్లు, ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడిపారు. సినిమాను సక్సెస్ చేసుకున్నారు.
తాజాగా విక్రమ్ చిత్రం తంగలన్ విడుదల కాగా.. ఆ చిత్రంకు సంబంధించి ప్రమోషన్లలో విక్రమ్ బిజీ బిజీగా గడిపారు. సినిమా రిలీజ్ కు ముందు చెన్నై లో బిజీ బిజీగా గడిపిన విక్రమ్ రిలీజ్ అనంతరం విజయవాడ, విశాఖ పట్నం, హైదరాబాద్ లో సక్సెస్ మీట్ లలో కూడా పాల్గొన్నాడు. హైదరాబాద్ లో థియేటర్ లో సినిమా కూడా చూశాడు. ఇలా ప్రమోషన్ల కోసం ఒక తమిళ హీరో ఇంతలా కష్టపడుతుంటే తెలుగు హీరోలు మాత్రం ప్రమోషన్లు, ఈవెంట్లకు రాకుండా సైలెంట్ గా సినిమా హిట్ కావాలంటే ఎలా అని నిర్మాతలు పెదవి విరుస్తున్నట్లు సమాచారం.