Freedom : ఇది కదా నిజమైన స్వాతంత్య్రం అంటే..

Freedom

Freedom

Freedom : భారతావని 78వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశంలోని గల్లీ గల్లీలో స్వాతంత్ర్య అంబరాలు అంటుతున్నాయి. ఎటు చూసినా స్వాతంత్ర్య సమరయోధుల స్మరణ, దేశభక్తి గీతాల ఆలాపన..ఇలా ప్రజలంతా దేశభక్తిభావంతో పులకరించిపోతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై జెండా ఎగురవేసి..జాతిని ఉద్దేశించి మాట్లాడారు.. ఏడున్నర దశాబ్దాల కాలంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందని, కానీ ఇది సరిపోదని 2047 నాటికి అన్ని రంగాల్లో భారత్ అభివృద్ధి సాధించి ‘వికసిత్ భారత్’గా నిలువాలని ఆకాంక్షించారు.

ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో స్వాతంత్ర్య సంబరాలు మిన్నంటాయి. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు జెండావిష్కరణ చేసి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి జెండావిష్కరణ చేసి తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చెప్పడంతో పాటు గత పాలనల్లో జరిగిన విధ్వంసాన్ని ప్రజల ముందు పెట్టారు.

ఏపీలో జగన్ పాలించిన ఐదేండ్లలో ఎంతటి విధ్వంసం జరిగిందో అందరికీ తెలిసిందే. వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. నిరుద్యోగం, పేదరికం తాండవించాయి. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు సరికదా..ఇసుక దోపిడీ, ఖనిజ దోపిడీ, పథకాల్లో అవినీతి..ఎటు చూసిన అవినీతి మేతే. మూడు రాజధానులంటూ ఒక్క రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు. ఇక తెలంగాణలో కేసీఆర్ పదేళ్లలో ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతి, ప్రతీ పథకంలోనూ గులాబీ రాయుళ్ల అవినీతి, నిరుద్యోగులను, ఉద్యోగులను అష్టకష్టాలు పెట్టారు. చివరకు ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ అధికారంలోకి వచ్చారు. జగన్, కేసీఆర్ ల నియంతృత్వ పాలన నుంచి ప్రజలకు స్వేచ్ఛావాయువులు పీల్చే విధంగా ప్రజా పాలన సాగిస్తున్నారు. అందుకే నేటి స్వాతంత్ర్య దినోత్సవం తెలుగు ప్రజలకు నిజంగా పెద్ద పండుగే.

TAGS