Sharwanand : విడాకుల కోసం తిరుగుతున్న శర్వానంద్.. అప్పుడే డైవర్సా అంటున్న ఫ్యాన్స్

Sharwanand

Sharwanand

Sharwanand : సినిమా ఇండస్ర్టీలో నటీనటుల  వైవాహిక జీవితాలు సాఫీగా ఉంటే ఆశ్చర్యపోవాలేమో అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు డేటింగ్ లో ఉండి, పెళ్లి చేసుకుంటున్న సినీ తారలు ఆ తర్వాత విడాకుల బాట పడుతున్నారు.  తాజాగా  టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ శర్వా కూడా విడాకులు తీసుకుంటున్నాడనే రూమర్ బయటకు రావడంతో అంతా షాక్ అవుతున్నారు.

ప్రముఖ నటుడు శర్వానంద్ వరుసల సినిమాలతో మళ్లీ బిజీ అయ్యాడు. శర్వా గతేడాది పెళ్లి చేసుకున్నాడు. శర్వా,  రక్షితా రెడ్డిలది పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ దంపతులకు పెళ్లైన ఏడాదిలోపే పండంటి ఆడబిడ్డ జన్మించింది. సాఫీగా సాగిపోతున్న వీరి వైవాహిక జీవితం.. విడాకుల దాకా వచ్చిందనే రూమర్ బయటకు వచ్చింది. శర్వా దంపతులు అప్పుడే విడాకుల దాకా వెళ్లడమేంటని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే తర్వాత కానీ అసలు విషయం బయట పడలేదు. శర్వానంద్ విడాకులు తీసుకుంటున్నది రియల్ లైఫ్ లో కాదు..రీల్ లైఫ్ లో.  ఈ విషయం తర్వాత బయట పడింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం శర్వా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

సామజ వరగమన సినిమా డైరెక్టర్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమాకు కమిట్ అయ్యారు. అయితే ఈ సినిమా విడాకుల నేపథ్యంలో తెరకెక్కతుందని సమాచారం. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. విడాకుల కోసం తిరిగే కథలో శర్వానంద్ నటించబోతున్నాడని టాక్. శర్వానంద్ సరసన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్, సాక్షి వైద్య ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. విడాకుల నేపథ్యంలో సాగే కాన్సెప్ట్‌తో శర్వానంద్ సినిమా తెరకెక్కిస్తున్నారు.

TAGS